Balakrishna - Akhanda : నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా, జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రలో నటించారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 2న రిలీజ్ కాబోతుంది. రీసెంట్‌గా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు రాజమౌళి, అల్లు అర్జున్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విడుదల తేది దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది చిత్రబృందం. ఇక ప్రీ రిలీజ్ వేడుకలో విడుదల చేసిన ‘జై బాలయ్య’ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇప్పటికే సెన్సార్ వాళ్లు ఈ చిత్రానికి ‘U/A’ సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ సినిమా రెండు గంటల 47 నిమిషాల నిడివితో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా అన్ని ఏరియాలకు కలిపి భారీ రేంజ్‌లో బిజినెస్ చేసినట్టు సమాచారం. పైగా కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదల కాబోతున్న భారీ యాక్షన్ చిత్రం కావడం.. పైగా బాలకృష్ణ, బోయాపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా కావడంతో ‘అఖండ’ పై భారీ అంచనాలే ఉన్నాయి.
ఇద్దరం కలిసి అది తాగుదాం.. సీతారామశాస్త్రికి రామ్ గోపాల్ వర్మ విభిన్న నివాళి..
దీంతో అన్ని ఏరియాల్లో ఈ సినిమా ఓ రేంజ్‌లో బిజినెస్ జరిగింది. తెలంగాణ (నైజాం)లో ఈ సినిమా రూ. 11 కోట్లకు అమ్ముడు పోయింది. రాయలసీమ (సీడెడ్) రూ. 11 కోట్లు, ఇక ఉత్తరాంధ్ర రూ. 5.80 కోట్లు.. ఈస్ట్ గోదావరి .. రూ. 3.95 కోట్లు.. వెస్ట్ గోదావరి రూ. 3.44 కోట్లు, కృష్ణా రూ. 3.82 కోట్లు.. గుంటూరు 5.48 కోట్లు.. నెల్లూరు రూ. 1.89 కోట్లు.. మొత్తంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ సినిమా రూ. 46.38 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మరోవైపు రెస్టాఫ్ భారత్‌లో ఈ సినిమా రూ. 4.40 కోట్లు.. విదేశాల్లో (ఓవర్సీస్) రూ. 2.47 కోట్లు వసూళు చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్ రూపంలో దాదాపు 1 మిలియన్ రాబట్టినట్టు సమాచారం. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 53.25 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
సీతారామశాస్త్రి మరణంపై ఉప రాష్ట్రపతి, ప్రధాని సహా రాజకీయ, సినీ ప్రముఖులు నివాళి..
ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 54 కోట్లు వసూళు చేయాలి. సెకండ్ వేవ్ తర్వాత తెలుగు ఈ స్థాయిలో ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమా ఇదే కావడం గమనార్హం. ఇక దీపావళి సందర్భంగా ఈ చిత్రం నుంచి విడుదలైన భం అఖండ, భంభం అఖండ ప్రేక్షకులను ఆకట్టుకుంది. థియేటర్‌లో పాట ఫ్యాన్స్‌కు పూనకాలనే తెస్తుందని అంటున్నారు నెటిజన్స్. థమన్ మ్యూజిక్‌తో పాటు లిరిక్స్ కూడా అదిరిపోయాయి. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా.. శంకర్ మహా దేవన్ పాడారు.
Sirivennala Seetharama Sastry: సిరివెన్నెల సీతారామశాస్త్రికి పేరు తీసుకొచ్చిన చిత్రాలు..
బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు చిత్రాలు రాగా.. ఈ మూడవ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఎన్టీఆర్ జయంతి మే 28న రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా విడుదలను వాయిదా వేసింది చిత్రబృందం. ఈ చిత్రం బాలయ్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా వస్తోంది.
Sirivennela Seetharama Sastry : కళా తపస్వీ విశ్వనాథ్‌తో సీతారామశాస్త్రి ప్రత్యేక అనుబంధం..
ఇక ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ హక్కులను హాట్ స్టార్, స్టార్ దక్కించుకుంది. దీనికి సంబంధించిన అధికార ప్రకటన విడుదలైంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ద్వారక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. అఖండ పూర్తవ్వడంతో బాలయ్య మరో సినిమాను మొదలు పెట్టారు. క్రాక్ డైరక్టర్ గోపీచంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. బాలయ్య గోపీచంద్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. త్వరలో షూటింగ్ మొదలుకానుంది. శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akhanda, Akhanda Movie Review, Balakrishna, Balayya, Boyapati Srinu, NBK