హోమ్ /వార్తలు /సినిమా /

Tollywood Most Viewed Teasers: ‘అఖండ’ టీజర్ మరో సంచలనం.. టాలీవుడ్ టాప్ లీగ్‌లోకి దూసుకుపోతున్న టీజర్..

Tollywood Most Viewed Teasers: ‘అఖండ’ టీజర్ మరో సంచలనం.. టాలీవుడ్ టాప్ లీగ్‌లోకి దూసుకుపోతున్న టీజర్..

పుష్పలో అల్లు అర్జున్ (Twitter/Photo)

పుష్పలో అల్లు అర్జున్ (Twitter/Photo)

Most viewed teasers in Tollywood: నందమూరి బాలకృష్ణ(Balakrishna) హీరోగా నటిస్తున్న అఖండ(Akhanda) టీజర్ సంచలనాలు రేపుతుంది. ఈ చిత్రం విడుదలైన రోజు నుంచి కూడా దుమ్ము దులిపేస్తుంది. తాజాగా 50 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి తెలుగు టీజర్స్‌లో టాప్ 2కి చేరుకుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ టాప్ 5 అత్యధిక వ్యూస్ సాధించిన టీజర్స్ ఏంటో ఓ సారి చూద్దాం..

ఇంకా చదవండి ...

బాలయ్య అఖండ టీజర్ ముందు సీనియర్, జూనియర్ అనే తేడా లేదు. అన్ని రికార్డులు మటు మాయం అవుతున్నాయి. తెలుగులో మాస్ జనాల్లో బాలయ్య కున్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.  ఆయన ఇమేజ్‌కు తగ్గ స్టోరీ పడితే.. దాని ఇంపాక్ట్ బాక్సాఫీస్ పై ఎలా ఉంటుందో మరోసారి ‘అఖండ’ టీజర్ ప్రూవ్ చేసింది.

ఈ రోజుల్లో సోషల్ మీడియా ఎంత పవర్ ఫుల్‌గా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన టీజర్ కానీ ట్రైలర్ కానీ యూ ట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు బాలయ్య సినిమా విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఈయన నటిస్తున్న అఖండ టీజర్ యూట్యూబ్‌లో రప్ఫాడిస్తుంది. ఈ సినిమా దెబ్బకు పాత రికార్డులు కూడా చెదిరిపోతున్నాయి. నందమూరి బాలకృష్ణ(Balakrishna) హీరోగా నటిస్తున్న అఖండ(Akhanda) టీజర్ సంచలనాలు రేపుతుంది. ఈ చిత్రం విడుదలైన రోజు నుంచి కూడా దుమ్ము దులిపేస్తుంది. తాజాగా 50 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ టాప్ 5 అత్యధిక వ్యూస్ సాధించిన టీజర్స్ ఏంటో ఓ సారి చూద్దాం..

1. పుష్ప: 54.78 మిలియన్

' isDesktop="true" id="855552" youtubeid="Lk2oDvoonUc" category="movies">

2. అఖండ: 50.78 మిలియన్ (స్టిల్ కౌంటింగ్)

' isDesktop="true" id="855552" youtubeid="gJZQ_YFkUdY" category="movies">

3. RRR రామరాజు ఫమ్ భీమ్: 50.68 మిలియన్

' isDesktop="true" id="855552" youtubeid="BN1MwXUR3PM" category="movies">

4. భీమ్ ఫర్ రామరాజు: 44 మిలియన్

' isDesktop="true" id="855552" youtubeid="2_BkCz3OnlY" category="movies">

5. సరిలేరు నీకెవ్వరు: 33.81 మిలియన్

' isDesktop="true" id="855552" youtubeid="VbuK58iQ_qc" category="movies">

ఇందులో పుష్ప టీజర్ రికార్డులను బాలయ్య బీట్ చేసేలా కనిపిస్తున్నారు. సీనియర్ హీరోల్లో మాత్రం ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు బాలయ్య. ఇపుడు జూనియర్ హీరోల్లో ఒక్కొక్కరి దాటుకుంటూ టాప్ ప్లేస్‌లో వెళ్లెలా కనిపిస్తోంది బాలయ్య అఖండ టీజర్. మొత్తంగా అత్యంత తక్కువ 17 రోజుల్లో ఈ సినిమా 50 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది.

First published:

Tags: Akhanda, Allu Arjun, Balakrishna, Boyapati Srinu, Jr ntr, Mahesh Babu, NBK, Pushpa Movie, Ram Charan, RRR, Sarileru Neekevvaru, Tollywood

ఉత్తమ కథలు