హోమ్ /వార్తలు /సినిమా /

BalaKrishna - Akhanda : బాలయ్య ‘అఖండ’లోని ఆ సీన్‌తో ప్రజల్లో అవగాహన కల్పిస్తోన్న హైదరాబాద్ పోలీసులు..

BalaKrishna - Akhanda : బాలయ్య ‘అఖండ’లోని ఆ సీన్‌తో ప్రజల్లో అవగాహన కల్పిస్తోన్న హైదరాబాద్ పోలీసులు..

బాలకృష్ణ ‘అఖండ’ (Twitter/Photo)

బాలకృష్ణ ‘అఖండ’ (Twitter/Photo)

BalaKrishna - Akhanda :  గత కొన్ని రోజులుగా ట్రాఫిక్ రూల్స్ పాటించే విషయంతో పాటు, కరోనా కొత్త నియమ నిబంధనలు ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రభుత్వాలతో పాటు వివిధ సంస్థలు ఇపుడున్న కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. తాజాగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. ’అఖండ’ మూవీలోని ఓ సీన్‌తో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.

ఇంకా చదవండి ...

BalaKrishna - Akhanda :  గత కొన్ని రోజులుగా ట్రాఫిక్ రూల్స్ పాటించే విషయంతో పాటు, కరోనా కొత్త నియమ నిబంధనలు ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రభుత్వాలతో పాటు వివిధ సంస్థలు ఇపుడున్న కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, టీఎస్‌ఆర్టీసీ, కేంద్ర సమాచార శాఖ ఇప్పటికే సినిమాలోని పాపులర్ డైలాగులు..  సన్నివేశాలతో ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాన్ని చేపడుతున్నారు.  ప్రజలను ఆకట్టుకునే విధంగా సినిమాలోని పాపులర్ డైలాగులతో మీమ్స్‌ను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే  కేంద్ర సమాచార మంత్రిత్వ శాక కూడా ప్రజల్లో కరోనా పై అవగాహన కలిగేలా.. అల్లు అర్జున్ రీసెంట్ మూవీ ‘పుష్ప’ మూవీని ఎంచుకుంది. ఇందులో ఎంతో పాపులర్ అయిన ‘తగ్గేదేలే’ డైలాగ్‌తో ఓ మీమ్‌ను క్రియేట్ చేసింది. ఇపుడీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తాజాగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ’ సినిమాలోని ఓ సీన్‌లో జీపు నడుపుతుండగా  హీరో బాలయ్య సీటు బెల్టు పెట్టుకుంటారు. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ పెట్టుకోదు. ఈ సందర్భంగా హీరో ముందు ఓ లారీ వస్తుండగా సడెన్ బ్రేక్ వేస్తారు. ఈ సందర్భంగా హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ముందుకు పడిపోతూ ఉంటే.. హీరో చెయ్యి పెట్టి కాపాడతారు. ఈ సందర్భంగా బాలకృష్ణ.. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌ను సీటు బెల్టు పెట్టుకోమని చెబుతారు.

ఈ సీన్‌ను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమ ట్విట్టర్ అకౌంట్‌లో ఈ సీన్‌ను పోస్ట్ చేసి ఫోర్ వీలర్‌లో ప్రయాణం చేసేటపుడు సీటు బెల్టు పెట్టుకోండి అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘అఖండ’ సినిమాలో ఈ సన్నివేశాన్ని పెట్టి ప్రజల్లో సీటు బెల్టు పెట్టుకోవాలన్న అవగాహన పెంచారని హీరోగా నందమూరి బాలకృష్ణతో పాటు దర్శకుడు బోయపాటి శ్రీనుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.

Mahesh - NTR- Akhil : మహేష్ బాబు, ఎన్టీఆర్ ఇపుడు అఖిల్.. ఆ విధంగా సక్సెస్ అందుకున్న హీరోలు..

బాలకృష్ణ ‘అఖండ’  విషయానికొస్తే.. ఈ సినిమాలో ‘అఖండ’ పాత్రలో బాలయ్య తప్ప ఇంకే హీరో కూడా చేయలేడంటూ నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. కామన్ ఆడియన్స్ కూడా బాలయ్య నటనకు ఫిదా అయిపోతున్నారు. లాజిక్స్ లేకపోయినా కూడా మాస్ మ్యాజిక్ ఈ సినిమాలో బాగానే పని చేసింది. సినిమాలో చిన్న చిన్న లోపాలున్నా కూడా కాంబినేషన్ క్రేజ్ సినిమాకు భారీ లాభాలు తీసుకొచ్చింది.

Gentleman 2 : ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌ ’జెంటిల్‌మేన్ 2’ కు మ్యూజిక్ డైరెక్టర్‌గా కీరవాణి.. అఫీషియల్ ప్రకటన..

ఇపుడు డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. బాక్సాఫీస్ దగ్గర శివ తాండవం చేసిన ఈ సినిమా ఓటీటీలో కూడా రికార్డులు బద్దలు కొడుతోంది. అక్కడ వచ్చిన క్షణం నుంచే రికార్డులు తిరగరాస్తున్నారు బాలయ్య.ఈ సినిమా ఓటీటీ వేదికగా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేయి కళ్లతో వేచి చూసిన ఫ్యాన్స్.. వచ్చీ రాగానే మరోసారి డిస్నీ హాట్ స్టార్‌లో ఈ సినిమా చూస్తున్నారు.  తాజాగా ‘అఖండ’ మూవీ  హాట్ స్టార్ డిస్నీలో బిగ్గెస్ట్ ఓపెనింగ్ రికార్డులను సొంతం చేసుకుంది. ఇదే విషయాన్ని వాళ్లు అధికారికంగా ట్వీట్ కూడా చేసారు. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేసారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

First published:

Tags: Akhanda movie, Balakrishna, Boyapati Sreenu, Hyderabad Traffic Police, NBK, Tollywood

ఉత్తమ కథలు