Home /News /movies /

BALAKRISHNA AKHANDA MOVIE CLIMAX SHOOT STARTS AT TAMILNADU TODAY TA

Balakrishna - Akhanda: క్లైమాక్స్ షూటింగ్‌లో బాలకృష్ణ ’అఖండ’ మూవీ.. అలా ప్లాన్ చేసిన బోయపాటి శ్రీను..

బాలయ్య ‘అఖండ’ క్లైమాక్స్ స్టార్ట్ (Twitter/Photo)

బాలయ్య ‘అఖండ’ క్లైమాక్స్ స్టార్ట్ (Twitter/Photo)

Balakrishna - Akhanda: నందమూరి బాలకృష్ణ,బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న ‘అఖండ’ సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి.

    Balakrishna - Akhanda: నందమూరి బాలకృష్ణ,బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న ‘అఖండ’ సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. లేకపోతే మే 28న ఎన్టీఆర్ జయంతి రోజున ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలై ఈ పాటి డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదలై ఉండేది. దాంతో పాటు శాటిలైట్ ఛానెల్స్‌లో కూడా ప్రసారమై ఉండేది. ఇక ఉగాది సందర్భంగా విడుదలైన ’అఖండ’ టైటిల్ పోస్టర్‌తో పాటు టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.అంతేకాదు టాలీవుడ్‌లో తక్కువ టైమ్‌లో 50M వ్యూస్ క్రాస్ చేసిన టీజర్‌గా బాలకృష్ణ ‘అఖండ’ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ‘అఖండ’ సినిమాలో బాలకృష్ణ మూడు విభిన్న పాత్రల్లో నటించనున్నారు. ఒకటి కలెక్టర్ పాత్ర అయితే. .రెండోది ఫ్యాక్షనిస్ట్, మూడోది అఘోర అని ఈ సినిమా పోస్టర్స్‌ బట్టి అభిమానులు అంచనా వేస్తున్నారు. దీంతో అభిమానులు కూడా ఈ సినిమా ఎపుడెపుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    రీసెంట్‌గా ఈ నెల 12న ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే కదా. ఈ షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. తాజాగా ఈ  రోజు నుంచి ఈ సినిమా క్టైమాక్స్ షూటింగ్‌ను తమిళనాడులోని ఓ పురాతన శివాలయంలో  మొదలు పెట్టారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించారు.

    ఆగస్టు, సెప్టెంబర్ లో ‘అఖండ’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి దసరాకు సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి. సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో.. అభిమానులు మాత్రమే కాదు ఆడియన్స్ కూడా అఖండ సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నారు. బాలయ్య గత సినిమాల రిజల్ట్‌తో సంబంధం లేకుండా ఈ సినిమా దాదాపు రూ. 60 కోట్ల వరకు బిజినెస్ చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్‌‌తో పాటు డిజిటల్, శాటిలైట్ హక్కులు కూడా భారీ రేటుకు  అమ్ముడుపోయాయి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Akhanda, Balakrishna, Boyapati Srinu, Tollywood

    తదుపరి వార్తలు