Home /News /movies /

BALAKRISHNA AKHANDA MOVIE ANOTHER RECORD THIS MOVIE CROSSES 20 MILLION VIEWS IN YOUTUBE IN A WEEK TA

Balakrishna - Akhanda : బాలకృష్ణ ‘అఖండ’ దూకుడు.. వారం రోజుల్లో 20 మిలియన్ వ్యూస్‌తో అరాచకం..

బాలకృష్ణ ‘అఖండ’ 20 మిలియన్ వ్యూస్ (Twitter/Photo)

బాలకృష్ణ ‘అఖండ’ 20 మిలియన్ వ్యూస్ (Twitter/Photo)

నందమూరి నట సింహం బాలకృష్ణ  (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తోన్న యాక్షన్ ఫిల్మ్ అఖండ. తాజాగా ఈ సినిమా యూట్యూబ్‌లో మరో రికార్డును క్రియేట్ చేసింది.

  నందమూరి నట సింహం బాలకృష్ణ  (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తోన్న యాక్షన్ ఫిల్మ్ అఖండ. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా, జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలో నటిస్తుండగా, తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 2న రిలీజ్ కాబోతుంది. దీనికి అధికారిక ప్రకటన విడుదలైంది. విడుదల తేది దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది చిత్రబృందం. విడుదల తేది దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది చిత్రబృందం. అందులో భాగంగా ఇప్పటికే ఓ రెండు పాటలను విడుదల చేసిన టీమ్.. తాజాగా ట్రైలర్‌ను వదిలింది.

  ట్రైలర్ ఓ రేంజ్‌లో ఉందని చెప్పోచ్చు.. బాలయ్య డైలాగ్స్‌తోడు మేకోవర్ అదిరిపోయింది. దీంతో నెటిజన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. నవంబర్ 14న సాయంత్రం 7:09 గంటలకు విడుదలైన సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. లైక్స్ పరంగా వ్యూస్ పరంగా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. వారం రోజుల్లో 20 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. తెలుగుతో పాటు సౌత్ హీరోల్లో యూట్యూబ్‌లో బాలయ్య మాత్రమే తక్కువ సమయంలో ఈ రికార్డు అందుకున్నారు. ఈ సినిమాను 429 K లైక్స్ వచ్చాయి.  ఇప్పటికే ‘అఖండ’ సినిమా తాజాగా సెన్సార్‌ను కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ వాళ్లు కూడా మాస్ ఆడియన్స్‌కు విందు భోజనం అని చెబుతున్నారు. ఇక అఖండకు U/A సర్టిఫికేట్ జారీ చేవారు. ఈ సినిమా రెండు గంటల 47 నిమిషాల నిడివితో విడుదల కానుంది.

  Sreemukhi : కొంటె చూపులతో కవ్విస్తోన్న అందాల యాంకర్ శ్రీముఖి.. వావ్ అనాల్సిందే...


  ఇక దీపావళి సందర్భంగా ఈ చిత్రం నుంచి విడుదలైన భం అఖండ‌, భంభం అఖండ ప్రేక్షకులను ఆకట్టుకుంది. థియేటర్‌లో పాట ఫ్యాన్స్‌కు పూనకాలనే తెస్తుందని అంటున్నారు నెటిజన్స్. థమన్ మ్యూజిక్‌తో పాటు లిరిక్స్ కూడా అదిరిపోయాయి. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా.. శంకర్ మహా దేవన్ పాడారు.

  Kaikala Satyanarayana : నటుడిగా కైకాల సత్యనారాయణ సినీ ప్రస్థానంలో కీలక మలుపులు ఇవే..


  బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో ఇప్పటికే ‘సింహా, ‘లెజెండ్’ చిత్రాలు రాగా.. ఈ మూడవ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఎన్టీఆర్ జయంతి మే 28న రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా విడుదలను వాయిదా వేసింది చిత్రబృందం. ఈ చిత్రం బాలయ్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా వస్తోంది. ఈ సినిమా అన్ని అంచనాలుకి తగ్గట్టే అదిరే బిజినెస్ ని కూడా జరుపుకుంటోందని తెలుస్తోంది. ఈ చిత్రం నైజాం హక్కులు కూడా భారీ ధర పలికినట్టు టాక్ నడుస్తోంది. నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఏకంగా రూ.19కోట్లకు కొనుగోలు చేశారని అంటున్నారు.

  Kollywood Heroes In Tollywood : రజినీ,కమల్, సూర్య సహా తెలుగులో సత్తా చూపెట్టిన హీరోలు..


  ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమా మొత్తం ఆంధ్ర హక్కులు రూ. 35 కోట్ల రేషియోకు అమ్ముడయ్యాయి, ఇక సీడెడ్ రీజియన్ హక్కులు రూ .12 కోట్లకు అమ్ముడు పోయాయని అంటున్నారు. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.

  Rajinikanth - Peddhanna Final Collections: ‘పెద్దన్న’ క్లోజింగ్ కలెక్షన్స్.. రజినీకాంత్‌కు ఘోర అవమానం..


  ఇక ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ హక్కులను హాట్ స్టార్, స్టార్ దక్కించుకుంది. దీనికి సంబంధించిన అధికార ప్రకటన విడుదలైంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ద్వారక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. అఖండ పూర్తవ్వడంతో బాలయ్య మరో సినిమాను మొదలు పెట్టారు. క్రాక్ డైరక్టర్ గోపీచంద్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. బాలయ్య గోపీచంద్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. త్వరలో షూటింగ్ మొదలుకానుంది. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించనుంది.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Akhanda, Balakrishna, Boyapati Srinu, NBK 106, Tollywood

  తదుపరి వార్తలు