Home /News /movies /

BALAKRISHNA AKHANDA JOINS 100CR CLUB IN TEN DAYS HERE ARE THE DETAILS SR

Balakrishna | Akhanda : పది రోజుల్లో వంద కోట్లు... బాలయ్య అఖండకు భారీ విజయం..

Akhanda Photo : Twitter

Akhanda Photo : Twitter

Balakrishna | Akhanda : ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. అంచనాలను మించి దుమ్ము లేపుతోంది అఖండ. ఈ సినిమా పదిరోజుల్లో 100 కోట్ల క్లబ్‌కి చేరింది. కేవలం పది రోజుల్లోనే బాలయ్య, బోయపాటిల హ్యాట్రిక్ కాంబినేషన్ సినిమా ఈ ఫీట్ ని సాధించి సాలిడ్ రికార్డు నెలకొల్పడం పట్ల అభిమానులు తెగ ఆనంద పడుతున్నారు.

ఇంకా చదవండి ...
    నందమూరి నట సింహం బాలకృష్ణ  (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా, జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. అంచనాలను మించి దుమ్ము లేపుతోంది అఖండ. ఈ సినిమా పదిరోజుల్లో 100 కోట్ల క్లబ్‌కి చేరిందని అంటున్నారు. కేవలం పది రోజుల్లోనే బాలయ్య, బోయపాటిల హ్యాట్రిక్ కాంబినేషన్ సినిమా ఈ ఫీట్ ని సాధించి సాలిడ్ రికార్డు నెలకొల్పడం పట్ల అభిమానులు తెగ ఆనంద పడుతున్నారు. ఇక మరోవైపు ఈ చిత్రం ఓవర్సీస్‌లో కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం అక్కడ 9 లక్షల 50 వేల డాలర్స్ రాబట్టి.. అతి త్వరలో వన్ మిలియన్ క్లబ్‌లో చేరనుంది.

    ఇక అది అలా ఉంటే ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్‌ ఓ రేంజ్‌లో అమ్ముడు పోయాయని తెలుస్తోంది. అఖండ హిందీ డబ్బింగ్ హక్కులను ప్రముఖ పంపిణీ సంస్థకు విక్రయించింది చిత్రబృందం. కేవలం హిందీ డబ్బింగ్ రైట్స్ నుంచి రూ. 20 కోట్లను అందాయని అంటున్నారు. మరోవైపు ఈ సినిమాను హిందీలో రీమేక్ కూడా చేస్తున్నారని.. ఈ రీమేక్‌లో అక్షయ్ లేదా అజయ్ దేవగన్ నటిస్తారని అంటున్నారు. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.




    బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు చిత్రాలు రాగా.. ఈ మూడవ చిత్రం కూడా మంచి విజయం దక్కించుకుంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఎన్టీఆర్ జయంతి మే 28న రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా విడుదలను వాయిదా వేసింది చిత్రబృందం. ఇక ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ హక్కులను హాట్ స్టార్, స్టార్ దక్కించుకుంది. దీనికి సంబంధించిన అధికార ప్రకటన విడుదలైంది. థమన్ సంగీతం అందించారు. ఈ సినిమాను ద్వారక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. ఇక అఖండ పూర్తవ్వడంతో బాలయ్య మరో సినిమాను మొదలు పెట్టారు.

    Samantha Ruth Prabhu : పుష్ప ఐటెమ్ సాంగ్ కోసం సమంత పరువాల విందు.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

    క్రాక్ డైరక్టర్ గోపీచంద్‌  (Gopichand)దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. బాలయ్య గోపీచంద్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. త్వరలో షూటింగ్ మొదలుకానుంది. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించనుంది.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter, and Google News)
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Akhanda movie, Balakrishna, Boyapati Sreenu, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు