Home /News /movies /

Balakrishna | Akhanda : భారీ ధరకు అమ్ముడైన అఖండ హిందీ రైట్స్.. బాలయ్య క్రేజ్ అలాంటిది..

Balakrishna | Akhanda : భారీ ధరకు అమ్ముడైన అఖండ హిందీ రైట్స్.. బాలయ్య క్రేజ్ అలాంటిది..

నందమూరి బాలకృష్ణ Photo : Twitter

నందమూరి బాలకృష్ణ Photo : Twitter

Balakrishna | Akhanda : ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్‌ ఓ రేంజ్‌లో అమ్ముడు పోయాయని తెలుస్తోంది. అఖండ హిందీ డబ్బింగ్ హక్కులను ప్రముఖ పంపిణీ సంస్థకు విక్రయించింది చిత్రబృందం. కేవలం హిందీ డబ్బింగ్ రైట్స్ నుంచి రూ. 20 కోట్లను అందాయని అంటున్నారు.

ఇంకా చదవండి ...
    నందమూరి నట సింహం బాలకృష్ణ  (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా, జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. అంచనాలను మించి మొదటి రోజు దుమ్ము లేపిన అఖండ రెండో రోజు, మూడో రోజు కూడా మంచి హోల్డ్ నే సొంతం చేసుకుంది. అఖండ మూడు రోజులు పూర్తీ అయ్యే సరికి టోటల్ వరల్డ్ వైడ్ గా 35.4 కోట్ల షేర్ మార్క్ ని అందుకుంది. ఈ చిత్రం కేవలం 3 రోజుల్లోనే రూ. 56 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని, ఈరోజు నుంచి జంట తెలుగు రాష్ట్రాల్లోని పలు ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వడానికి రెడీగా ఉందని చెబుతున్నారు.

    ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే.. అఖండ సినిమాను ఓవర్సీస్ మొత్తం మీద 2.5 కోట్ల రేటుకి అమ్మగా ప్రీమియర్స్ అండ్ ఫస్ట్ డే కలెక్షన్స్2తో ఈ సినిమా 2.35 కోట్ల షేర్‌ని సొంతం చేసుకుందని అంటున్నారు. ఈ సినిమా రెండో రోజు అక్కడ 1.1 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు అమెరికాలో హాఫ్ మిలియన్ మార్క్ ని దాటేసింది. ఇక అమెరికాలో 575K మార్క్ ని అందుకున్న సినిమా ఈరోజుతో 600K మార్క్ ని అందుకోబోనుందని అంటున్నారు. ఇక అది అలా ఉంటే ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్‌ ఓ రేంజ్‌లో అమ్ముడు పోయాయని తెలుస్తోంది. అఖండ హిందీ డబ్బింగ్ హక్కులను ప్రముఖ పంపిణీ సంస్థకు విక్రయించింది చిత్రబృందం. కేవలం హిందీ డబ్బింగ్ రైట్స్ నుంచి రూ. 20 కోట్లను అందాయని అంటున్నారు. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.


    బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు చిత్రాలు రాగా.. ఈ మూడవ చిత్రం కూడా మంచి విజయం దక్కించుకుంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఎన్టీఆర్ జయంతి మే 28న రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా విడుదలను వాయిదా వేసింది చిత్రబృందం. ఇక ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ హక్కులను హాట్ స్టార్, స్టార్ దక్కించుకుంది. దీనికి సంబంధించిన అధికార ప్రకటన విడుదలైంది. థమన్ సంగీతం అందించారు. ఈ సినిమాను ద్వారక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. ఇక అఖండ పూర్తవ్వడంతో బాలయ్య మరో సినిమాను మొదలు పెట్టారు.

    Samantha | Allu Arha : అల్లు అర్జున్ కూతురు అంత పని చేసిందా.. సమంత కామెంట్స్ ఏంటీ..

    క్రాక్ డైరక్టర్ గోపీచంద్‌  (Gopichand)దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. బాలయ్య గోపీచంద్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. త్వరలో షూటింగ్ మొదలుకానుంది. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించనుంది.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter, and Google News)
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Akhanda movie, Balakrishna, Tollywood news

    తదుపరి వార్తలు