Home /News /movies /

BALAKRISHNA AKHANDA FIFTEEN DAYS COLLECTIONS HERE ARE THE DETAILS SR

Balakrishna | Akhanda : అఖండ పదిహేను రోజుల కలెక్షన్స్... తగ్గని జోరు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..

Akhanda Photo : Twitter

Akhanda Photo : Twitter

Balakrishna | Akhanda : నందమూరి నట సింహం బాలకృష్ణ  (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ. ఈ సినిమా డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది.

ఇంకా చదవండి ...
    నందమూరి నట సింహం బాలకృష్ణ  (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా, జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. అంచనాలను మించి దుమ్ము లేపుతోంది అఖండ. ఈ సినిమా పదిరోజుల్లో 100 కోట్ల క్లబ్‌కి చేరి రికార్డ్ క్రియేట్ చేసింది. అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వారాన్ని పూర్తీ చేసుసుకుని తాజాగా మూడో వారంలో అడుగు పెట్టింది. అయితే ఒక పక్క పుష్ప అడ్వాన్స్ బుకింగ్స్ ఉండడంతో పాటు మరో పక్క స్పైడర్ మాన్ వంటి మార్వెల్ సినిమా ఉండటంతో అఖండ కలెక్షన్స్ కాస్తా తగ్గాయి. ఈ సినిమా15 వ రోజు కాస్తా నిరాశ పరిచింది. అఖండ 14 వరోజుతో పోల్చితే 20 టు 25% వరకు డ్రాప్ అయ్యిందని అంటున్నారు.

    తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 30 లక్షల నుండి 35 లక్షల దాక కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని అంటున్నారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ బిజినెస్ 53 కోట్ల అవ్వగా.. బ్రేక్ ఈవెన్ కోసం 54 కోట్ల రేంజ్‌లో షేర్‌ని అందుకోవాల్సి ఉంది. అయితే ఇప్పటి ఈ సినిమా ప్రాఫిట్‌ జోన్‌లోకి వెళ్లి లాభాలను తెచ్చింది.


    ఇక అది అలా ఉంటే ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్‌ ఓ రేంజ్‌లో అమ్ముడు పోయాయని తెలుస్తోంది. అఖండ హిందీ డబ్బింగ్ హక్కులను ప్రముఖ పంపిణీ సంస్థకు విక్రయించింది చిత్రబృందం. కేవలం హిందీ డబ్బింగ్ రైట్స్ నుంచి రూ. 20 కోట్లను అందాయని అంటున్నారు. మరోవైపు ఈ సినిమాను హిందీలో రీమేక్ కూడా చేస్తున్నారని.. ఈ రీమేక్‌లో అక్షయ్ లేదా అజయ్ దేవగన్ నటిస్తారని అంటున్నారు. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.

    Anchor Suma: లంగా ఓణీలో యాంకర్ సుమ కనకాల బ్యూటీఫుల్ పిక్స్..

    బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు చిత్రాలు రాగా.. ఈ మూడవ చిత్రం కూడా మంచి విజయం దక్కించుకుంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఎన్టీఆర్ జయంతి మే 28న రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా విడుదలను వాయిదా వేసింది చిత్రబృందం. ఇక ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ హక్కులను హాట్ స్టార్, స్టార్ దక్కించుకుంది. దీనికి సంబంధించిన అధికార ప్రకటన విడుదలైంది. థమన్ సంగీతం అందించారు. ఈ సినిమాను ద్వారక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. ఇక అఖండ పూర్తవ్వడంతో బాలయ్య మరో సినిమాను మొదలు పెట్టారు.

    క్రాక్ డైరక్టర్ గోపీచంద్‌  (Gopichand)దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. బాలయ్య గోపీచంద్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. త్వరలో షూటింగ్ మొదలుకానుంది. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించనుంది.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter, and Google News)
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Akhanda movie, Balakrishna, Tollywood news

    తదుపరి వార్తలు