Balakrishna - Unstoppable NBK : నందమూరి నటి సింహాం ఇపుడ సినిమాలతో పాటు ‘Unstoppable With NBK’ అంటూ టాక్ షో చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే మొదలైన ఈ షో ఫస్ట్ ఎపిసోడ్‌కు మోహన్ బాబు గెస్ట్ హాజరయ్యారు. ఈ షోకు ఆడియన్స్ నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఆ తర్వాత బాలయ్య.. రెండో ఎపిపోడ్‌ను నాచురల్ స్టార్ నానితో టాక్ షో నిర్వహించారు. ఈ షోలో నాని, బాలయ్య సరదగా చెప్పుకున్న కబుర్లు ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించాయి.ఈ షోలో బాలయ్య ఎవరికి జీవితం వడ్డించిన విస్తరి కాదు. మన ప్రయత్నానికి మనమే నారు పోసి.. నీరు పెట్టి.. కోత కోసి.. కుప్ప నూర్చి.. ఆ వరిని ఉడికించి మనమే వడ్డించుకోవాలి అపుడే జీవితం స్వర్గం అన్నారు.
దీపావళి సందర్బంగా ‘ఆహా’ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ (Unstoppable With NBK) ప్రారంభమైంది. మొదటి రెండు ఎపిసోడ్స్ తర్వాత మూడో షో ప్రసారం కాలేదు. దీంతో ఈ షో పై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఐతే.. ‘అఖండ’ షూటింగ్ సమయంలో చేతికి గాయం కావడంతో డాక్టర్లు మూడు వారాలు రెస్ట్ తీసుకోమని చెప్పడంతో బాలయ్య ‘ఆహా’ కోసం తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. ఇక రీసెంట్‌గా జరిగిన ‘అఖండ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా బాలయ్య చేతికి కట్టుతో హాజరయ్యారు.
#NandamuriBalakrishna Garu is back with his trademark energy to set your screens ablaze with great conversations and celebrations ?#UnstoppableWithNBK episode 3 coming this week on @ahavideoIN Promo soon.#MansionHouse @tnldoublehorse @swargaseema pic.twitter.com/f3dIixyTxt
— BA Raju's Team (@baraju_SuperHit) November 29, 2021
తాజాగా బాలయ్య మూడో ఎపిపోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. మూడు వారాలు గ్యాప్ వచ్చింది. ఎన్నో మెసెజెస్, ఎన్నో ఫోన్ కాల్స్, నేను ఎలా ఉన్నానని కాదు. మళ్లీ నెక్ట్స్ ఎపిసోడ్ ఎపుడా అని.. నెక్ట్స్ ఎపిసోడ్ ఎపుడా అని.. నెక్ట్స్ ఎపిసోడ్ ఎపుడా అని.. వారం వారం రావడానికి నేను సీరియల్ కాదు. సెలబ్రేషన్. ‘ది ఎనర్జీ ఈజ్ బ్యాక్’ అంటూ నెక్ట్స్ ఎపిపోడ్ ఈ వారం ప్రసారం కానుంది. ఈ వారం గెస్ట్‌గా ఎవరు వస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ వారం ‘అఖండ’ టీమ్ ఈ షోకు హాజరవుతారా లేకుంటే బ్రహ్మానందం వస్తారా లేకపోతే.. ఇంకెవరైనా స్పెషల్ గెస్ట్ రానున్నారా అనేది ఆసక్తికరంగా మారింది.
Chiranjeevi : ఫామ్‌లో లేని ఒకప్పటి టాప్ డైరెక్టర్‌కు మెగాస్టార్ చిరంజీవి ఛాన్స్..?
ఇక బాలయ్య నటించిన ‘అఖండ’ సినిమా డిసెంబర్ 2న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు అల్లు అర్జున్ ఛీఫ్ గెస్ట్‌గా.. రాజమౌళి స్పెషల్ గెస్ట్‌గా హాజరయ్యారు. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా, జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రలో నటిస్తుండగా, తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akhanda movie, Balakrishna, Tollywood, Unstoppable NBK