బాలకృష్ణ‌కు పోటీగా కార్తీ... ఈ పోరులో గెలిచేదెవరు..

నందమూరి బాలకృష్ణ.. కే.యస్ రవికుమార్ దర్శకత్వంలో 105వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

news18-telugu
Updated: November 10, 2019, 8:54 AM IST
బాలకృష్ణ‌కు పోటీగా కార్తీ... ఈ పోరులో గెలిచేదెవరు..
Instagram
  • Share this:
నందమూరి బాలకృష్ణ.. కే.యస్ రవికుమార్ దర్శకత్వంలో 105వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం బాలయ్య కొంత బరువు తగ్గి.. అదిరిపోయే మేకోవర్‌తో సరికొత్తగా కనపడుతున్నాడు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో బాలయ్య సరికోత్తగా కనబడుతున్నాడు. రూలర్‌గా వస్తోన్న ఈ సినిమాలో బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్‌గా అదరగొట్టనున్నాడు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ భూమిక మరో ముఖ్యపాత్రలో నటిస్తోంది. రూలర్‌ను డిసెంబర్ 20న విడుదల చేయనున్నారు. అది అలా ఉంటే తమిళ స్టార్‌ హీరో కార్తీ నటించిన తంబి అనే ఓ తమిళ సినిమా కూడా అదే రోజున విడుదలకు సిద్దమవుతోంది.

వివరాల్లోకి వెళితే.. ఖైదీ సినిమా హిట్‌తో ఫుల్‌ జోష్‌తో దూసుకెళ్తున్నారు కార్తీ.  ఆయన ఇప్పటికే ఈ ఏడాది ‘దేవ్‌’, ‘ఖైదీ’ చిత్రాలతో పలకరించారు. ఇప్పుడు ముచ్చటగా మూడో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట. 'దృశ్యం’ వంటి వైవిధ్యభరిత కథా చిత్రంతో అందరి దృష్టినీ ఆకర్షించిన జీతూ జోసెఫ్‌ దీన్ని తెరకెక్కిస్తున్నారు. తమిళ్‌లో ‘తంబి’ అనే టైటిల్‌‌తో వస్తున్న ఈ సినిమా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అంతేకాదు క్రిస్మస్‌ పండుగ సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారని తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సినిమాను తెలుగులో కూడా డిసెంబరు 20నే విడుదల చేయాలని చూస్తున్నారట చిత్ర దర్శక నిర్మాతలు.ఒకవేళ ఇదే నిజమైతే కార్తీ ఈ క్రిస్మస్‌ పోరులో బాలయ్య ‘రూలర్‌’ పోటి పడాల్సి ఉంటుంది. దీనికి తోడు సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా వస్తున్న ‘ప్రతిరోజు పండగే’ ఈ  చిత్రాలతో పోటీ పడాల్సి ఉంటుంది.  మరో వైపు హిందీ హీరో సల్మాన్‌ ఖాన్‌ ‘దబాంగ్‌ 3’ కూడా విడుదలౌతోంది. చూడాలి మరీ ఈ పోరులో ఏ సినిమా ప్రేక్షకులను అలరించనుందో..

కుందనపు బొమ్మ కీర్తి సురేష్ లేటెస్ట్ ఫోటో షూట్..

First published: November 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading