హోమ్ /వార్తలు /సినిమా /

Balagam OTT: ప్రముఖ ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చేసిన బలగం మూవీ..

Balagam OTT: ప్రముఖ ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చేసిన బలగం మూవీ..

‘బలగం’ మూవీ రివ్యూ (Twitter/Photo)

‘బలగం’ మూవీ రివ్యూ (Twitter/Photo)

Balagam Movie OTT News : జబర్ధస్త్ నటుడు వేణు టిల్లు డైరెక్షన్‌ దర్శకత్వంలో ప్రియదర్శి పులికొండ, కావ్య కళ్యాణ్ రామ్ జోడిగా నటించిన సినిమా ‘బలగం’. బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న ఈసినిమా ప్రముఖ ఓటీటీలో విడుదలై దూసుకుపోతుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Balagam OTT Streaming: చిన్న సినిమాగా విడుదలైన ‘బలగం’ మూవీ పెద్ద హిట్‌గా నిలిచింది. జబర్ధస్త్ నటుడు వేణు టిల్లు డైరెక్షన్‌ దర్శకత్వంలో ప్రియదర్శి పులికొండ, కావ్య కళ్యాణ్ రామ్ జోడిగా నటించిన సినిమా ‘బలగం’. దిల్ రాజు సమర్ఫణలో హర్షిత్ రెడ్డి, హన్షిత ప్రొడ్యూస్ చేసారు. మార్చి 3న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ సినిమా విడుదలైన హిట్ సొంతం చేసుకుంది. మల్లేశం తర్వాత హీరోగా ప్రియదర్శికి ఈ సినిమాతో మరో సక్సెస్ అందుకున్నాడు. ప్రియదర్శిలో మంచి కమెడియన్‌ కాకుండా.. మంచి నటుడు ఉన్న విషయం మల్లేశం మూవీతోనే ఇది వరకు ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాలో మధ్య తరగతి తెలంగాణ యువకుడి పాత్రలో తన పరధి మేరకు రాణించాడు. ప్రియదర్శి తాత పాత్రలో నటించిన సుధాకర్ రెడ్డి తన  పాత్రలో జీవించాడు. కావ్యా కళ్యాణ్ రామ్ కూడా తన పాత్రలో ఒదిగిపోయింది. సినిమాలోని మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.

ముఖ్యంగా దర్శకుడు వేణు యెల్డంది ఈ సినిమాను తెలంగాణ పల్లెల్లోని నేపథ్యాన్ని కళ్లకు కట్టినట్టు చూపించాడు. తెలంగాణతో పాటు  పల్లెలతో  అనుబంధం ఉన్న ప్రతి వ్యక్తి ఈ సినిమాకు కనెక్ట్ అవుతున్నారు. దీంతో ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఆదరించారు.  ముఖ్యంగా నేటి యువత డబ్బు విషయంలో ఎలా ఉంటున్నారనే విషయాన్ని హీరో పాత్ర ద్వారా చక్కగా తెరపై చూపించాడు. మంచి ఆదరణతో థియేటర్స్ లో దూసుకెళ్తున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) సొంతం చేసుకున్నసంగతి తెలిసిందే.  కాగా ఈ సినిమా మూడు వారాల థియేట్రికల్ రన్ తర్వాత నేటి నుంచి (మార్చి 25) స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ ఈ సినిమా  టాప్ 2లో ట్రెండ్‌ అవుతోంది. పఠాన్ వంటి సినిమా తర్వాత ఈ సినిమా ఈ రేంజ్‌లో ఓటీటీలో రెస్సాన్స్ తెచ్చుకోవడం మామలు విషయం కాదు.

ఈ సినిమా ఏరియా వైజ్ 22 రోజుల థియేట్రికల్ కలెక్షన్స్  విషయానికొస్తే..

ఈ సినిమా తెలంగాణ (నైజాం) - రూ. 15.51 కోట్ల గ్రాస్

రాయలసీమ (సీడెడ్) + ఆంధ్ర ప్రదేశ్  - రూ. 7.23 కోట్ల గ్రాస్

తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి. - రూ. 22.54 కోట్ల గ్రాస్ (రూ. 10.31 కోట్ల షేర్)

కర్ణాటక + రెస్టాఫ్ భారత్ + ఓవర్సీస్ - రూ. 42 లక్షల గ్రాస్

ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.96 కోట్ల గ్రాస్ (రూ. 10.51 కోట్ల షేర్ ) రాబట్టింది.

ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 1.30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 10.51 కోట్ల షేర్ రాబట్టి  పెట్టిన పెట్టుబడికి నాలుగింతల లాభాన్ని తీసుకొచ్చింది.  ఇక  ఈ సినిమా ఇప్పటికే రూ. 9.21కోట్ల లాభాలతో తెలుగులో మరో బ్లాక్ బస్టర్‌గా  నిలిచింది. 2023లో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు, రైటర్ పద్మభూషణ్, సార్, వినరో భాగ్యము విష్ణు కథ తర్వాత ‘బలగం’ సినిమా 7వ క్లీన్‌ హిట్‌గా నిలిచింది.

First published:

Tags: Balagam Movie, Dil raju, Priyadarshi, Tollywood

ఉత్తమ కథలు