Balagam Movie : జబర్ధస్త్ నటుడు వేణు (Venu Yeldandi) టిల్లు డైరెక్షన్ దర్శకత్వంలో ప్రియదర్శి పులికొండ, కావ్య కళ్యాణ్ రామ్ జోడిగా నటించిన సినిమా లేటెస్ట్ డ్రామా ‘బలగం’ (Balagam).దిల్ రాజు సమర్ఫణలో హర్షిత్ రెడ్డి, హన్షిత ప్రొడ్యూస్ చేసారు. మార్చి 3న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. థియేటర్స్‌లో విడుదలై ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మల్లేశం తర్వాత హీరోగా ప్రియదర్శికి ఈ సినిమాతో మరో సక్సెస్ అందుకున్నాడు. ప్రియదర్శిలో (Priyadarshi) మంచి కమెడియన్ కాకుండా.. మంచి నటుడు ఉన్న విషయం మల్లేశం మూవీతోనే ఇది వరకు ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాలో మధ్య తరగతి తెలంగాణ యువకుడి పాత్రలో తన పరిధి మేరకు రాణించాడు. ప్రియదర్శి తాత పాత్రలో నటించిన సుధాకర్ రెడ్డి తన పాత్రలో జీవించాడు. కావ్యా కళ్యాణ్ రామ్ కూడా తన పాత్రలో ఒదిగిపోయింది. సినిమాలోని మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.
ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా దర్శకుడు వేణు యెల్డండి ఈ సినిమాను తెలంగాణ పల్లెల్లోని నేపథ్యాన్ని కళ్లకు కట్టినట్టు చూపించాడు. తెలంగాణతో పాటు పల్లెలతో అనుబంధం ఉన్న ప్రతి వ్యక్తి ఈ సినిమాకు కనెక్ట్ అవుతున్నారు. దీంతో ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఆదరిస్తున్నారు. నేటి యువత డబ్బు విషయంలో ఎలా ఉంటున్నారనే విషయాన్ని హీరో పాత్ర ద్వారా చక్కగా తెరపై చూపించాడు. మంచి ఆదరణతో థియేటర్స్ లో దూసుకెళ్తున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) సొంతం చేసుకున్నసంగతి తెలిసిందే.
ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ (Balagam Movie streaming on amazon prime) అవుతోన్న ఈచిత్రం అక్కడ టాప్ 2లో ట్రెండింగ్ అవుతోంది. ఈ సినిమాను చూసిన నెటిజన్స్ సినిమా పట్ల తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. సినిమా కన్నీళ్లు పెట్టించిదనీ.. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయన్ని బాగా చూపించారనీ.. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షితారెడ్డి ఈ విలేజ్ డ్రామాని నిర్మించారు. వేణు యెల్దండి, మురళీధర్ గౌడ్, జయరామ్, రూప, రాచ రవి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.
ఇక బలగం కలెక్షన్స్ (Balagam Collections) విషయానికి వస్తే.. ఈ సినిమా 23 రోజులు పూర్తీ అయ్యే సమయానికి 23.59 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను వసూలు చేసి వావ్ అనిపించింది. బలగం సినిమా బడ్జెట్ మొత్తం మీద 2.2 కోట్ల లోపు మాత్రమే ఉండగా.. 23 రోజుల్లో ఏకంగా 23.59 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని, 10.81 షేర్ అందుకుని.. బలగం నిర్మాతలకు భారీ లాభాలను అందించింది. ఈ సినిమా ఒక్క నైజాం ఏరియాలోనే 16 కోట్ల నుండి 20 కోట్ల లోపు గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. అంతేకాదు చిన్న సినిమాల్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాఫిటబుల్ మూవీగా బలగం రికార్డ్ క్రియేట్ చేయనుందని అంటున్నారు. ఈ 2023లో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు, రైటర్ పద్మభూషణ్, సార్, వినరో భాగ్యము విష్ణు కథ తర్వాత ‘బలగం’ సినిమా 7వ క్లీన్ హిట్‌గా నిలిచింది. ఓవరాల్‌గా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు వసూళ్లను రాబడుతుందనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balagam Movie, Tollywood news