Balagam Movie Collections: జబర్ధస్త్ నటుడు వేణు టిల్లు డైరెక్షన్ దర్శకత్వంలో ప్రియదర్శి పులికొండ, కావ్య కళ్యాణ్ రామ్ జోడిగా నటించిన సినిమా ‘బలగం’. దిల్ రాజు సమర్ఫణలో హర్షిత్ రెడ్డి, హన్షిత ప్రొడ్యూస్ చేసారు. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ సినిమా విడుదలైన హిట్ సొంతం చేసుకుంది. మల్లేశం తర్వాత హీరోగా ప్రియదర్శికి ఈ సినిమాతో మరో సక్సెస్ అందుకున్నాడు. ప్రియదర్శిలో మంచి కమెడియన్ కాకుండా.. మంచి నటుడు ఉన్న విషయం మల్లేశం మూవీతోనే ఇది వరకు ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాలో మధ్య తరగతి తెలంగాణ యువకుడి పాత్రలో తన పరధి మేరకు రాణించాడు. ప్రియదర్శి తాత పాత్రలో నటించిన సుధాకర్ రెడ్డి తన పాత్రలో జీవించాడు. కావ్యా కళ్యాణ్ రామ్ కూడా తన పాత్రలో ఒదిగిపోయింది. సినిమాలోని మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.
తాజాగా బలగం సినిమా చూసి మెగాస్టార్ ప్రశంసలు కురిపించారు. ఎన్నో ఏళ్ల తర్వాత హృద్యమైన తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా చూసినట్టు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఇలాంటి అద్భుతమైన సినిమా తీసినందకు దర్శకుడు వేణుకు ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. తెలంగాణ పల్లెల్లో తాను చూసిన అంశాలను ఈ సినిమాలో చూపించారు. దిల్ రాజు వంటి కమర్షియల్ ప్రొడ్యూసర్ ఉన్నప్పటికీ ఆ హంగులు లేకుండా నిజాయితీగా కథ చెప్పిన వేణును చిరు ప్రశంసించారు. నిజంగా ఇంతమంచి సినిమా తిసి షాక్ ఇచ్చావయ్యా.. ఇలా షాక్ ఇస్తే ఎలా ., అంటూ చిరంజీవి.. వేణును ఉద్దేశిస్తూ సరదాగా వ్యాఖ్యానించారు.
A mega moment for team #Balagam! Thank you megastar @KChiruTweets Garu for your kind words! This means the world to us❤❤@OfflVenu @priyadarshi_i @KavyaKalyanram @dopvenu @LyricsShyam #BheemsCeciroleo @DilRajuProdctns @HR_3555 #HanshithaReddy @adityamusic @vamsikaka pic.twitter.com/piPOsVan5K
— Dil Raju Productions (@DilRajuProdctns) March 11, 2023
అటు వేణు కూడా తన 20 యేళ్ల సినీ ప్రయాణంలో ఇంకేం కావాలి నాకు 20 సంవత్సరాల నా సినీ ప్రయాణంలో మరిచిపోలేని రోజును చిరంజీవి గారు నాకు ఇచ్చారు. థాంక్యూ సో మచ్ సార్. నా జీవితాంతం గుర్తిండి పోయే క్షణం నాకు ఇది నా బలగం విజయం ఋణపడి ఉంటాను చిరంజీవి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.
ఇంకేం కావాలి నాకు 20 సంవత్సరాల నా సినీ ప్రయాణంలో మరిచిపోలేని రోజును చిరంజీవి గారు నాకు ఇచ్చారు థాంక్యూ సో మచ్ సార్ నా జీవితాంతం గుర్తుండిపోయే క్షణం నాకు ఇది నా బలగం విజయం రుణపడి ఉంటాను చిరంజీవి గారికి Thank you megastar @KChiruTweets Garu for your kind words ! pic.twitter.com/WkeNJ48e3j
— Venu Yeldhandi #BalagamOnMarch3 (@OfflVenu) March 11, 2023
ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా దర్శకుడు వేణు యెల్డంది ఈ సినిమాను తెలంగాణ పల్లెల్లోని నేపథ్యాన్ని కళ్లకు కట్టినట్టు చూపించాడు. తెలంగాణతో పాటు పల్లెలతో అనుబంధం ఉన్న ప్రతి వ్యక్తి ఈ సినిమాకు కనెక్ట్ అవుతున్నారు. దీంతో ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఆదరిస్తున్నారు. ఈ సినిమాకు వస్తోన్న రెస్పాన్స్ నేపథ్యంలో ఈ మూవీని అమెరికా వంటి ఓవర్సీస్‌లో మరిన్ని ప్రాంతాల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా నేటి యువత డబ్బు విషయంలో ఎలా ఉంటున్నారనే విషయాన్ని హీరో పాత్ర ద్వారా చక్కగా తెరపై చూపించాడు.
Day 1 - రూ. 55 లక్షలు గ్రాస్..
Day 2 - రూ. 80 లక్షల గ్రాస్
Day 3 - రూ. 1.75 కోట్ల గ్రాస్
Day 4 - రూ. 58 లక్షల గ్రాస్
Day 5 - రూ. 1.80 కోట్ల గ్రాస్
Day 6 - రూ. 86 లక్షలు గ్రాస్
Day 7 - రూ. 58 లక్షల గ్రాస్
Day 8 - రూ. 46 లక్షల గ్రాస్
ఈ సినిమా ఏరియా వైజ్ 8 రోజుల థియేట్రికల్ కలెక్షన్స్ విషయానికొస్తే..
ఈ సినిమా తెలంగాణ (నైజాం) - రూ. 4.47 కోట్ల గ్రాస్
రాయలసీమ (సీడెడ్) + ఆంధ్ర ప్రదేశ్ - రూ. 2.91 కోట్ల గ్రాస్
తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి. - రూ. 7.38 కోట్ల గ్రాస్ (రూ. 3.21 కోట్ల షేర్)
కర్ణాటక + రెస్టాఫ్ భారత్ + ఓవర్సీస్ - రూ. 15 లక్షల గ్రాస్
ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.84కోట్ల గ్రాస్ (రూ. 3.28 కోట్ల షేర్ ) రాబట్టింది.
ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 1.30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 3.28 కోట్ల షేర్ రాబట్టి డబుల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా ఇప్పటికే రూ. 1.98 కోట్ల లాభాలతో తెలుగులో మరో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. 2023లో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు, రైటర్ పద్మభూషణ్, సార్, వినరో భాగ్యము విష్ణు కథ తర్వాత ‘బలగం’ సినిమా 7వ క్లీన్ హిట్‌గా నిలిచింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balagam Movie, Chiranjeevi, Dil raju, Tollywood