హోమ్ /వార్తలు /సినిమా /

Balagam Movie 2 Weeks WW Collections: ‘బలగం’ మూవీ 14 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. 2 వారాల్లో టోటల్ ఫ్రాఫిట్ ఎంతంటే..

Balagam Movie 2 Weeks WW Collections: ‘బలగం’ మూవీ 14 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. 2 వారాల్లో టోటల్ ఫ్రాఫిట్ ఎంతంటే..

బలగం మూవీ 2 వారాల బాక్సాఫీస్ కలెక్షన్స్ (File/Photo)

బలగం మూవీ 2 వారాల బాక్సాఫీస్ కలెక్షన్స్ (File/Photo)

Balagam Movie 2nd Week World Wide Box Office Collections: జబర్ధస్త్ నటుడు వేణు టిల్లు డైరెక్షన్‌ దర్శకత్వంలో ప్రియదర్శి పులికొండ, కావ్య కళ్యాణ్ రామ్ జోడిగా నటించిన సినిమా ‘బలగం’. నిన్నటితో రెండు వారాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా టాలీవుడ్‌లో త్రిపుల్ బ్లాక్ బ్లాస్టర్‌గా నిలిచింది. మొత్తంగా 14 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Balagam Movie 14 Days Collections: జబర్ధస్త్ నటుడు వేణు టిల్లు డైరెక్షన్‌ దర్శకత్వంలో ప్రియదర్శి పులికొండ, కావ్య కళ్యాణ్ రామ్ జోడిగా నటించిన సినిమా ‘బలగం’. దిల్ రాజు సమర్ఫణలో హర్షిత్ రెడ్డి, హన్షిత ప్రొడ్యూస్ చేసారు. మార్చి 3న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ సినిమా విడుదలైన హిట్ సొంతం చేసుకుంది. మల్లేశం తర్వాత హీరోగా ప్రియదర్శికి ఈ సినిమాతో మరో సక్సెస్ అందుకున్నాడు. ప్రియదర్శిలో మంచి కమెడియన్‌ కాకుండా.. మంచి నటుడు ఉన్న విషయం మల్లేశం మూవీతోనే ఇది వరకు ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాలో మధ్య తరగతి తెలంగాణ యువకుడి పాత్రలో తన పరధి మేరకు రాణించాడు. ప్రియదర్శి తాత పాత్రలో నటించిన సుధాకర్ రెడ్డి తన  పాత్రలో జీవించాడు. కావ్యా కళ్యాణ్ రామ్ కూడా తన పాత్రలో ఒదిగిపోయింది. సినిమాలోని మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.

ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా దర్శకుడు వేణు యెల్డంది ఈ సినిమాను తెలంగాణ పల్లెల్లోని నేపథ్యాన్ని కళ్లకు కట్టినట్టు చూపించాడు. తెలంగాణతో పాటు  పల్లెలతో  అనుబంధం ఉన్న ప్రతి వ్యక్తి ఈ సినిమాకు కనెక్ట్ అవుతున్నారు. దీంతో ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఆదరిస్తున్నారు. ఈ సినిమాకు వస్తోన్న రెస్పాన్స్ నేపథ్యంలో ఈ మూవీని అమెరికా వంటి ఓవర్సీస్‌లో మరిన్ని ప్రాంతాల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా నేటి యువత డబ్బు విషయంలో ఎలా ఉంటున్నారనే విషయాన్ని హీరో పాత్ర ద్వారా చక్కగా తెరపై చూపించాడు.

ఈ సినిమా ఏరియా వైజ్ 14 రోజుల థియేట్రికల్ కలెక్షన్స్  విషయానికొస్తే..

ఈ సినిమా తెలంగాణ (నైజాం) - రూ. 9.46 కోట్ల గ్రాస్

రాయలసీమ (సీడెడ్) + ఆంధ్ర ప్రదేశ్  - రూ. 5.41 కోట్ల గ్రాస్

తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి. - రూ. 14.87 కోట్ల గ్రాస్ (రూ. 6.78 కోట్ల షేర్)

కర్ణాటక + రెస్టాఫ్ భారత్ + ఓవర్సీస్ - రూ. 33 లక్షల గ్రాస్

ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.20 కోట్ల గ్రాస్ (రూ. 6.94 కోట్ల షేర్ ) రాబట్టింది.

Top Highest Grosser Indian Movies: భారతీయ బాక్సాఫీస్ దగ్గర ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాలు.. KGF2, RRR,పఠాన్ ప్లేసెస్ ఎక్కడంటే..

ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 1.30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 6.94 కోట్ల షేర్ రాబట్టి త్రిపుల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక  ఈ సినిమా ఇప్పటికే రూ. 5.46 కోట్ల లాభాలతో తెలుగులో మరో బ్లాక్ బస్టర్‌గా  నిలిచింది. 2023లో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు, రైటర్ పద్మభూషణ్, సార్, వినరో భాగ్యము విష్ణు కథ తర్వాత ‘బలగం’ సినిమా 7వ క్లీన్‌ హిట్‌గా నిలిచింది. ఓవరాల్‌గా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు వసూళ్లను రాబడుతుందనేది చూడాలి.

First published:

Tags: Balagam Movie, Dil raju, Priyadarshi, Tollywood

ఉత్తమ కథలు