హోమ్ /వార్తలు /సినిమా /

మెగా హీరోలను వదిలే ప్రస్తకే లేదంటున్న బాలకృష్ణ

మెగా హీరోలను వదిలే ప్రస్తకే లేదంటున్న బాలకృష్ణ

మెగా కాంపౌండ్ హీరోలను నందమూరి నట సింహం బాలకృష్ణ అసలు విడిచిపెట్టడం లేదు. గత కొన్నేళ్లుగా సంక్రాంతికి రిలీజవుతున్న బాలయ్య సినిమాలు ఏదో ఒక మెగా హీరో సినిమాతో బాక్సాఫీస్ దగ్గర క్లాష్ అవుతూనే ఉంది.

  2017లో క్రిష్ దర్శకత్వంలో చేసిన సెంచరీ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాకి పోటీగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన ‘ఖైదీ నంబర్ 150’ ఒకరోజు ముందుగా రిలీజైంది.

  గౌతమిపుత్ర శాతకర్ణి, ఖైదీ నంబర్ 150

  ఈ సంక్రాంతి బాక్సాఫీస్ రేసులో ఇటు బాలయ్య...అటు చిరు ఇద్దరు సంక్రాంతి హీరోలుగా విజయాలను అందుకున్నారు. ఆ తర్వాత ఏడాది 2018లో బాలకృష్ణ..కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో చేసిన ‘జై సింహా’ కు పోటీగా వన్ డే బిఫోర్ పవన్ కళ్యాణ్.. ‘అజ్ఞాతవాసి’ విడుదలైంది. ఈ సంక్రాంతి రేసులో పవన్ ‘అజ్ఞాతవాసి’ అజ్ఞాతంలో కలిసిపోగా..బాలయ్య ‘జై సింహా’ మాత్రం బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది.

  జై సింహా, అజ్ఞాతవాసి

  ఈ ఇయర్ సంక్రాంతికి బాలకృష్ణ ..వాళ్ల నాన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’లో వాళ్ల నాన్న రామారావు పాత్రలో నటిస్తూ ఈ సినిమాను నిర్మించారు. ఈ బయోపిక్ ఫస్ట్ పార్ట్ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ మరికొన్ని గంట్లో రిలీజ్ కానుంది. ప్రపంచ సినీ చరిత్రలో ఒక తండ్రి బయోపిక్‌లో నటిస్తోన్న కుమారుడిగా బాలయ్య ఒక రికార్డు క్రియేట్ చేసాడు. అంతేకాదు ఈ సినిమా ఎన్టీఆర్ ఫస్ట్ టైమ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనవరి 9నే విడుదల కావడం చెప్పుకోదగ్గ విశేషం. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు ‘యూ’ సర్టిఫికేట్ జారీ చేశారు. అంతేకాదు ఈ సినిమా 171 నిమిషాల నిడివితో తెరకెక్కింది.

  ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సెన్సార్ సర్టిఫికేట్

  ఇక ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాకు పోటీగా రామ్ చరణ్ హీరోగా నటించిన ‘వినయ విధేయ రామ’ ఈ  నెల 11న విడుదల కానుంది. మరోవైపు 12వ తేదిన వెంకటేశ్, వరుణ్ తేజ్ ‘ఎఫ్2’ రిలీజైవుతోంది. మొతానికి 2019 సంక్రాంతి రేసులో బాలయ్యతో ఇద్దరు మెగా హీరోలు పోటీ పడుతున్నారు.

  రామ్ చరణ్, ఎన్టీఆర్, వరుణ్ తేజ్

  మరి ఈ పొంగల్ పోటీలో ఎవరు విజేతలుగా నిలుస్తారో తెలియాలంటే ఈ సినిమాల విడుదల వరకు వెయిట్ చేయాల్సిందే.

  ఇవి కూడా చదవండి 

  టాలీవుడ్‌లో చిచ్చు పెట్టిన రజినీకాంత్ ‘పేట’

  ‘ఎన్టీఆర్’ కోసం జోలె పట్టిన బాలకృష్ణ..

  ఫస్ట్ లుక్ అదిరింది....‘యాత్ర’లో విజయమ్మ పాత్రలో బాహుబలి నటి

  First published:

  Tags: Bala Krishna Nandamuri, Boyapati Srinu, Chiranjeevi, Krish, NTR Biopic, Pawan kalyan, Ram Charan, Telugu Cinema, Tollywood, Varun Tej

  ఉత్తమ కథలు