హోమ్ /వార్తలు /సినిమా /

Bal Shivaji : బాలీవుడ్‌ వెండితెరపై ‘ఛత్రపతి శివాజీ’ బయోపిక్.. ‘బాల్ శివాజీ’ టైటిల్‌తో తెరకెక్కనున్న మూవీ..

Bal Shivaji : బాలీవుడ్‌ వెండితెరపై ‘ఛత్రపతి శివాజీ’ బయోపిక్.. ‘బాల్ శివాజీ’ టైటిల్‌తో తెరకెక్కనున్న మూవీ..

Bal Shivaji :  ప్రస్తుతం వెండితెరపై బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. ఈ కోవలో మరాఠా యోధుడు అఖండ హిందూ సామ్రాజ్యాధినేతగా పేరు గడించి.. అప్పటి మొఘల్ పాలకుడు ఔరంగజేబును గడగడలాడించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించనున్నారు.

ఇంకా చదవండి ...

  Bal Shivaji :  ప్రస్తుతం వెండితెరపై బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ నాయకులు, హీరోలు, స్పోర్ట్స్ పర్సన్స్, మాపియా డాన్స్ ఇలా ఒక వ్యక్తి జీవితంలో ఏదైనా ఆకట్టుకునే అంశం ఉంటే.. ఆయా దర్శక, నిర్మాతలు, హీరోలు అటువంటి సబ్జెక్ట్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో గత కొన్నేళ్లుగా ఇలాంటి సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే వివిధ రంగాల్లో రాణించిన ప్రముఖులు వ్యక్తుల జీవితాలను వెండితెరపై వచ్చాయి. మరికొన్ని సెట్స్ పై ఉన్నాయి. తాజాగా మరాఠా యోధుడు అఖండ హిందూ సామ్రాజ్యాధినేతగా పేరు గడించి.. అప్పటి మొఘల్ పాలకుడు ఔరంగజేబును గడగడలాడించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించనున్నారు.

  నేడు ఆ మహనీయుడు 392వ జయంతి సందర్భంగా శివాజీ జీవితాన్ని సినిమాగా తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. ‘బాల్ శివాజీ’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. Eros ఇంటర్నేషనల్, ఆనంద్ పండిత్ మోషన్ పిక్చర్స్, రవి జాద్ ఫిల్మ్స్ మరియు లెజెండ్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. మన దేశానికి చెందిన మూడు అగ్రశ్రేణి స్టూడియోలు ఈ భారీ చారిత్రక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల చేశారు.

  బాల శివాజీ బయోపిక్ (Twitter/Photo)

  ముఖ్యంగా ఆయన బాల్యంలో జరిగిన సంఘటనలు, చరిత్రలో ఇంత వరకు ఎవరు సృశించని స్టోరీతో ఆయన 12 నుంచి 16 యేళ్ల మధ్య జరిగిన సంఘటనలతో దేశాన్ని బానిస సంకెళ్ల నుంచి స్వాతంత్య్రం కోసం పోరాడే నేపథ్యంలో  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి జాదవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ 2022లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో ఎవరు శివాజీ పాత్రలో నటిస్తారనేది త్వరలో వెల్లడించనున్నారు.

  Mohan Babu : మోహన్ బాబుకు ఘోర అవమానం.. ‘సన్నాఫ్ ఇండియా’తో మంచులా కరిగిపోయిన కలెక్షన్ కింగ్ మార్కెట్..

  ఇక రెండేళ్ల క్రితం కూడా ‘ఛత్రపతి శివాజీ’ జీవితాన్ని మూడు భాగాలుగా ‘సైరత్’ ఫేమ్ నాగరాజ్ మంజులే  దర్శకత్వంలో  తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు ప్రముఖ బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్. ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత ద్వయం అజయ్-అతుల్ సంగీతాన్ని అందించనున్నారు. ఈ సినిమా మొదటి భాగానికి ‘శివాజీ’ అని.. రెండో భాగానికి ‘రాజా శివాజీ’ మూడో భాగానికి ‘ఛత్రపతి శివాజీ’ అని టైటిల్ ఫిక్స్ చేసారు.

  బాల శివాజీ బయోపిక్ (Twitter/Photo)

  ఈ చిత్రాన్ని దేశంలోని అన్ని భాషల్లో  ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. ఇంత వరకు ఈ సినిమాపై ఎలాంటి అప్‌‌డేట్స్ లేవు. తాజాగా ఇపుడు తెరకెక్కుతోన్న ‘బాల శివాజీ’ సినిమానైనా వెండితెరపై చూడాలనుకునే అభిమానులున్నారు.  ఛత్రపతి శివాజీ మహారాజ్.. సామాన్య శకం ఫిబ్రవరి 19, 1630వ సంవత్సరం వైశాఖమాసపు శుక్లపక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర గల శివనేరి కోటలో శహాజీ, జిజాబాయి పుణ్యదంపతులకు జన్మించారు.

  First published:

  Tags: Bal Shivaji, Bollywood news, Chatrapathi Shivaji, Tollywood

  ఉత్తమ కథలు