అదిరిపోయిన ప్రభాస్ న్యూ లుక్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్...

సాహో మూవీతో ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్ న్యూలుక్ అదిరిపోయింది. ప్రజెంట్ ముంబైలో సాహో షూటింగ్‌లో ఉన్న ప్రభాస్‌ని చూసేందుకు ఫ్యాన్స్ సెట్స్‌కి వెళ్లారు.. ఆ టైమ్‌లో తీసిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది..

news18-telugu
Updated: April 30, 2019, 12:02 PM IST
అదిరిపోయిన ప్రభాస్ న్యూ లుక్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్...
ప్రభాస్ (ఫైల్ ఫొటో)
  • Share this:
బాహుబలి మూవీతో వరల్డ్ వైడ్‌గా క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్.. అప్పట్నుంచీ సాహో మూవీతోనే తెగ బిజీ అయిపోయాడు.. ఆ సినిమాతో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న మన డార్లింగ్.. బాహబలి సిరీస్ వచ్చి రెండేళ్లైన తెరపై సందడి చేయలేదు. అప్పట్నుంచీ సాహోమూవీకే అంకితం అయిపోయాడు. ప్రజెంట్ ముంబైలో ఈ మూవీ షూటింగ జరుగుతోంది. ఆ సెట్స్‌కి ప్రభాస్‌ని చూసేందుకుఫ్యాన్స్ వెళ్లారు. ఈ సందర్భంగా ప్రభాస్‌తో ఫొటోలు, సెల్ఫీలు దిగారు.. ఈ వీడియోని ఫ్యాన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.. అంతే.. ఇందులో క్రేజీ లుక్స్‌తో కనువిందు చేస్తున్న డార్లింగ్‌ని చూసి అమ్మాయిలంతా మనసుపారేసుకుంటున్నారు. వీడియో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే వైరల్ అయింది.

వీడియోలో గాగూల్స్ పెట్టుకుని సరికొత్త హెయిర్‌స్టైల్‌లో డార్లింగ్ కనిపించాడు.. అంతే ఇంకేముంది.. ఈ వీడియోని చూస్తూ ఫ్యాన్స్ అంతా పండగ చేసుకుంటున్నారు. చూసినవారంతా షేర్ షేర్ అంటూ షేర్ చేసేస్తున్నారు.

ముంబై షెడ్యూల్‌తో సాహో షూటింగ్ ముగుస్తుంది. బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీని సుజిత్ డైరెక్ట్ చేస్తున్నారు. ఆగస్టు 15న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది.

First published: April 30, 2019, 11:58 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading