Bahubali: మరోసారి ఒక్కటవనున్న బాహుబలి టీమ్..

ఒక్కో చినుకు తుపానుగా మారినట్టు.. తెలుగు సినిమాగా మొదలైన ‘బాహుబలి’ ఆ తర్వాత జాతీయ స్థాయి సినిమాగా ఆపై అంతర్జాతీయంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ పేరు మారు మోగేలా చేసింది. తాజాగా మరోసారి బాహుబలి టీమ్ ఒక్కటి కానుంది.

news18-telugu
Updated: October 4, 2019, 9:01 PM IST
Bahubali: మరోసారి ఒక్కటవనున్న బాహుబలి టీమ్..
బాహుబలి పోస్టర్
news18-telugu
Updated: October 4, 2019, 9:01 PM IST
ఒక్కో చినుకు తుపానుగా మారినట్టు.. తెలుగు సినిమాగా మొదలైన ‘బాహుబలి’ ఆ తర్వాత జాతీయ స్థాయి సినిమాగా ఆపై అంతర్జాతీయంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ పేరు మారు మోగేలా చేసింది. రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు ప్రభాస్, రానా, అనుష్క,రమ్యకృష్ణ,నాజర్,తమన్నాల నటన తోడై ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. మళ్లీ ఆ సినిమా టీమ్ మరోసారి లండన్ వేదికగా మరోసారి బాహుబలి టీమ్ లండన్‌లో ఒక వేదికపై సందడి చేయనున్నారు. అక్కడి రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ఈ నెల 19న ‘బాహుబలి : ది బిగినింగ్’, తో పాటు స్కైఫాల్, హ్యారీ పోటర్’ వంటి చిత్రాలను ప్రదర్శిస్తారు. ఈ సందర్భంగా బాహుబలి టీమ్ మొత్తం ఆ వేదికపై కలవబోతున్నారు. ఈ విషయాన్ని ప్రభాస్.. ట్విట్టర్ వేదికగా తెలిపారు. అంతేకాదు కీరవాణి ఆధ్వర్యంలో అక్కడ ఓ లైవ్ కాన్సెర్ట్ కూడా జరగనుంది.


First published: October 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...