అభిమానులకు సర్ఫ్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్న ప్రభాస్.. ఇంతకీ ఏమై ఉంటుంది..

అభిమానుల కోరిక మేరకు రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన ప్రభాస్... బాహుబలిగా కత్తి తిప్పుతున్న ఫస్ట్ ఫోటోను పోస్ట్ చేసి సంచలనం నమోదు చేసాడు. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభాస్‌కు సంబంధించిన అప్‌డేట్స్ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. తాజాగా ప్రభాస్..ఈ మంగళవారం అభిమానులకు సర్ప్రైజ్ గిప్ట్ ఇవ్వబోతున్నట్టు ఒక వీడియో రిలీజ్ చేసాడు. 

news18-telugu
Updated: May 20, 2019, 1:25 PM IST
అభిమానులకు సర్ఫ్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్న ప్రభాస్.. ఇంతకీ ఏమై ఉంటుంది..
ప్రభాస్ ఫైల్ ఫోటోస్
  • Share this:
అభిమానుల కోరిక మేరకు రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన ప్రభాస్... బాహుబలిగా కత్తి తిప్పుతున్న ఫస్ట్ ఫోటోను పోస్ట్ చేసి సంచలనం నమోదు చేసాడు. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభాస్‌కు సంబంధించిన అప్‌డేట్స్ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. తాజాగా ప్రభాస్..ఈ మంగళవారం అభిమానులకు సర్ప్రైజ్ గిప్ట్ ఇవ్వబోతున్నట్టు ఒక వీడియో రిలీజ్ చేసాడు.  ఇంతకీ ప్రభాస్ ప్రకటించబోయే సంచలన విషయం ఏమై ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్..సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ కానీకొచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేస్తారా లేకపోతే..రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తోన్న సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇస్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లేకపోతే..మరో కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన కీలక ప్రకటన చేస్తారా అనేది చూడాలి. అది కాకుంటే..తన పెళ్లికి సంబంధించిన అఫీషియల్  ప్రకటన చేసే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. మొత్తానికి మంగళవారం రోజు తన పెళ్లికి సంబంధించిన విషయాలను చెప్పే అవకాశమే లేదంటున్నారు. మొత్తానికి తన సినిమాలకు సంబంధించిన కీలక ప్రకటన చేసే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. 

View this post on Instagram
 

Hello darlings... A surprise coming your way, tomorrow. Stay tuned... #SaahoSurprise


A post shared by Prabhas (@actorprabhas) on
First published: May 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు