• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • BAHUBALI KALAKEYA FAME PRABHAKAR HAS NAMED HIS SON RAJAMOULI TA

రాజమౌళి పై భక్తితో కాళకేయ ఫేమ్ బాహుబలి ప్రభాకర్ ఏం చేసాడంటే..

రాజమౌళి పై భక్తితో కాళకేయ ఫేమ్ బాహుబలి ప్రభాకర్  ఏం చేసాడంటే..

కాళకేయ ప్రభాకర్ (Twitter/Photo)

ఎవరికైనా ఎవరిపైనా భక్తి ఉంటే ఏం చేస్తారు. ఆయన ఫోటోను ఇంట్లో పెట్టుకొని పూజ  చేస్తారు. కానీ రాజమౌళిపై భక్తితో ఆ సినిమాలో కాళకేయ రాజుగా నటించిన ప్రభాకర్ మాత్రం జక్కన్నపై తన భక్తిని ఈ విధంగా చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. 

  • Share this:
    ఎవరికైనా ఎవరిపైనా భక్తి ఉంటే ఏం చేస్తారు. ఆయన ఫోటోను ఇంట్లో పెట్టుకొని పూజ  చేస్తారు. కానీ రాజమౌళిపై భక్తితో ఆ సినిమాలో కాళకేయ రాజుగా నటించిన ప్రభాకర్ మాత్రం జక్కన్నపై తన భక్తిని ఈ విధంగా చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి వెళ్లింది. ఈ సినిమాతో దర్శకుడు రాజమౌళి కాస్తా పద్మశ్రీ రాజమౌళి అయ్యాడు. అంతేకాదు తెలుగులో అప్పటి వరకు చాలా చిత్రాలకు జాతీయ అవార్డులు వచ్చినా.. జాతీయ ఉత్తమ చిత్రంగా స్వర్ణ కమలం మాత్రం ఈ సినిమాకే వచ్చింది. ఈ సినిమాతో దర్శకుడి రాజమౌళితో పాటు హీరోలుగా ప్రభాస్, రానాలు నేషనల్ వైడ్‌గా పాపులర్ అయ్యారు. ఈ చిత్రంలో బాహుబలిని ఢీ కొట్టే బలమైన  కాళకేయగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు నటుడు ప్రభాకర్. ఈ సినిమా తర్వాత ప్రభాకర్ కాస్తా బాహుబలి ప్రభాకర్ అయిపోయాడు. ఈ సినిమాలో ప్రభాకర్ కాళకేయగా మాట్లాడే భాష అందరినీ ఆకట్టుకుంది. అంతేకాదు ఈ సినిమా తర్వాత విలన్‌గా కాలకేయ ప్రభాకర్‌కు మంచి ఆఫర్స్ పలకరించాయి. ఈ సందర్భంగా కాళకేయ ఫేమ్ ప్రభాకర్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం రాజమౌళి అని ప్రతి ఇంటర్వ్యూలో చెబుతూనే ఉంటాడు. ఆయన వల్లే నేను నా ఫ్యామిలీ ఎంతో సంతోషంగా ఉందన్నారు. ముందుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మర్యాద రామన్న’ సినిమాకు సెలెక్ట్ అయినపుడు తనకు డైలాగులు కూడా చెప్పడం రాదన్నారు.

    Bahubali Kalakeya fame prabhakar has named his son Rajamouli,bahubali,bahaubali fame kalakeya prabhakar,rajamouli,prabhakar,bahubali prabhakar,prabhakar son name rajamouli,rajamouli twitter,rajamouli instagram,prabhas,prabhas twitter,prabhas instagram,bahubali fame kalakeya prabhakar,tollywood,telugu cinema,బాహుబలి ప్రభాకర్,బాహుబలి,రాజమౌళి,బాహుబలి కాళకేయ ఫేమ్ ప్రభాకర్,ప్రభాస్,ప్రభాకర్ కొడుకు పేరు రాజమౌళి,కాళకేయ ప్రభాకర్ తన కొడుక్కి రాజమౌళి పేరు పెట్టారు,
    బాహుబలి ఫేమ్ ప్రభాకర్ (Twitter/Photo)


    రాజమౌళి సొంతంగా తనకు నటనలో మెలుకువలు నేర్పించారని ఆనాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు ప్రభాకర్. బాహుబలి వంటి నేషనల్ వైడ్ సినిమాలో తనకు మంచి పాత్ర ఇచ్చినందకు ఆయనకు నేను ఎప్పటికీ ఋణపడి ఉంటానన్నారు. ఆయన నాకు దేవుడు. అందుకే తనకు కొడుకు పుడితే.. నాకు ఇంత పేరు ప్రఖ్యాతలు, డబ్బులు వచ్చే విధంగా చేసిన  రాజమౌళిగారి పేరును తనకు కొడుకుకు పెట్టుకున్నానన్నారు. ఈ విధంగా రాజమౌళి పై తన అభిమానాన్ని చాటుకున్నారు ప్రభాకర్.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: