యంగ్ రెబల్ ప్రభాస్‌కు ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలిస్తే ఆశ్యర్యపోతారు..

Prabhas Assets | రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ హోల్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇక హీరోగా ప్రభాస్ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే నిజంగానే ఆశ్యర్యపోతారు.

news18-telugu
Updated: April 13, 2020, 2:00 PM IST
యంగ్ రెబల్ ప్రభాస్‌కు ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలిస్తే ఆశ్యర్యపోతారు..
ప్రభాస్ (Twitter/Photo)
  • Share this:
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ హోల్ ఇండియా స్టార్ అయిపోయాడు. అంతకు ముందు తను యాక్ట్ చేసిన డబ్బింగ్ సినిమాలతో ప్రభాస్ హిందీ ప్రేక్షకులతో పాటు మిగతా భాషలకు చెందిన ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక బాహుబలితో ప్రభాస్ క్రేజ్.. లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవల్‌కు పెరిగింది. ఇక బాహుబలి తర్వాత ప్రభాస్ యాక్ట్ చేసిన ‘సాహో’ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మొత్తంగా రూ. 400 కోట్లకు పైగా కలెక్ట్ చేసి హీరోగా ప్రభాస్ స్టామినా ఏంటో అందరికీ తెలిసేలా చేసింది. బాహుబలి సినిమాతో ప్రభాస్.. ఆల్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఈ సినిమా తర్వాత సాహో సినిమాకు దాదాపు నిర్మాణంలో వాటతో పాటు రెమ్యూనరేషన్ కలిపి దాదాపు రూ.75 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకొని అందరినీ ఆశ్యర్యపరిచాడు. ఇపుడు రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తోన్న సినిమా కోసం కూడా దాదాపు అంతే లెవల్‌లో పుచ్చుకుంటున్నాడు. ఇక అశ్వినీదత్ వైజయంతి మూవీస్ నిర్మాణంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తోన్న సినిమాకు దాదాపు రూ. 100 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్న సినీ వర్గాలు చెబుతున్నాయి.

Young rebel star prabhas shock to his fans here are the details,prabhas,prabhas twitter,Prabhas no updates after corona,prabhas covid 19,prabhas fans,prabhas fans request,prabhas fans twitter open request,prabhas in social media,prabhas 4 crore donation,prabhas 3 crore PM relief fund,prabhas 1 crore to AP Telangana cm relief fund,prabhas movies,prabhas radha krishna movie,prabhas self quarantine 14 days,prabhas sister,telugu cinema,prabhas krishnam raju,prabhas coronavirus,ప్రభాస్,ప్రభాస్ 4 కోట్ల విరాళం,ప్రభాస్ కరోనా వైరస్,ప్రభాస్ సెల్ఫ్ క్వారెంటైన్
ప్రభాస్ (Prabhas fans request)


సినిమాల్లో తీసుకునే ఈ రెమ్యునరేషన్ పక్కనపెడితే.. ప్రభాస్‌కు పెద్ద ఎత్తున ఆస్తులున్నాయి. ప్రభాస్ నాన్న సూర్యనారాయణ రాజు నిర్మాతగా పెద్ద నాన్న కృష్ణంరాజుతో పలు హిట్ చిత్రాలను నిర్మించారు. అంతేకాదు కృష్ణంరాజుకు సంబంధించిన అన్ని వ్యవహారాలను ఆయనే దగ్గరుండి చేసుకునేవారు. ఆయన తెలుగు రాష్ట్రాల్లో పాటు చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో స్థలాలను కొన్నారు. అంతేకాదు వాళ్లకు ఒక గ్రానైటు ఫ్యాక్టరీ ఉంది. వీటితో పాటు వ్యవసాయ ఆధారిత పొలాలు, కొబ్బరి తోటలు, వివిధ నగరాల్లో ఫామ్‌హౌస్‌లు ఉన్నాయని సమాచారం.  ఎంత లేదన్న ప్రభాస్‌కు దాదాపు స్థిర, చర ఆస్తులు కలపి దాదాపు రూ. 7 వేల కోట్లకు పైగా ఉన్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే తెలుగుల ఇండస్ట్రీలో ఇంత ఆస్తులున్న హీరో మరెవరు లేకపోవచ్చు. సో.. ప్రభాస్.. వెండితెరపై కాదు.. ఆస్తుల్లో కూడా నిజంగానే బాహుబలి అనే చెప్పొచ్చు.
Published by: Kiran Kumar Thanjavur
First published: April 13, 2020, 2:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading