Saaho Teaser Talk : నిజంగానే ‘సాహో’ అనిపించిన ప్రభాస్..

రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘బాహుబలి’ సిరీస్‌తో ప్రభాస్.. ఓవర్ నైట్ ఇండియన్ సూపర్ స్టార్ అయిపోయాడు. తాజాగా సాహో సినిమా టీజర్‌ను విడుదల చేసారు.

news18-telugu
Updated: June 13, 2019, 11:34 AM IST
Saaho Teaser Talk : నిజంగానే ‘సాహో’ అనిపించిన ప్రభాస్..
సాహో పోస్టర్స్
  • Share this:
రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘బాహుబలి’ సిరీస్‌తో ప్రభాస్.. ఓవర్ నైట్ ఇండియన్ సూపర్ స్టార్ అయిపోయాడు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ నటించబోయే సినిమాలపై అన్నిభాషలకు సంబంధించిన ఇండస్ట్రీ వాళ్లు ఎంతో ఇంట్రెస్ట్‌గా ఎదురు చూస్తున్నారు. ‘బాహుబలి’ వంటి భారీ సక్సెస్ తర్వాత ప్రభాస్.. సుజిత్ దర్శకత్వంలో దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘సాహో’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రారంభానికి ముందు ఒక టీజర్‌తో ఈ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పిన చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ విజువల్స్‌తో ఈ సినిమాపై అంచనాలు పెంచేసారు. తాజాగా సాహో సినిమా టీజర్‌ను విడుదల చేసారు. ఈ టీజర్ కూడా ఓ రేంజ్‌లో ఉంది. ఈ సినిమాలో సీన్స్, ఛేజింగ్ దృష్యాలను చూస్తే.. ఓ హాలీవుడ్ సినిమా చూస్తున్నామా అనే రేంజ్‌లో ఉంది. దర్శకుడిగా సుజిత్ టేకింగ్, ఫోటోగ్రఫీ, ప్రభాస్ స్టంట్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. 

అంతేకాదు ప్ర‌భాస్ ఏదైతే న‌మ్మ‌కం సుజీత్ మీద పెట్టుకున్నాడో దాన్ని వంద శాతం పూర్తి చేసినట్టే ఉంది ఈ టీజర్ చూస్తుంటే.. విజువల్ ట్రీట్ చూసిన తర్వాత సినిమా రేంజ్ ఏంటో దర్శక నిర్మాతలకు కూడా క్లారిటీ వచ్చేసింది. దాంతో ఆలస్యం అవుతున్నా కూడా ఏ మాత్రం కంగారు పడటం లేదు. ముఖ్యంగా హీరోయిన్ శ్రద్దా కపూర్ వీళ్లు ఎవరు అంటే... ప్రభాస్ ఫ్యాన్స్ అని చెప్పడం. మరి ఇలా ఉన్నారని శ్రద్దా అడిగితే.. డై హార్ట్ ఫ్యాన్స్ అని చెప్పడం బాగుంది. ఒక్క సినిమా అనుభవం ఉన్న దర్శకుడికి 200 కోట్లు బ‌డ్జెట్ అంటే చిన్న విష‌యం కాదు. ‘ర‌న్ రాజా ర‌న్‌’తో ఆక‌ట్టుకున్న సుజీత్.. సాహోతో సంచ‌ల‌నం సృష్టించ‌డం ఖాయం అని ఈ టీజర్‌ చూస్తే చెప్పొచ్చు.  తెలుగులో ఇప్ప‌టి వ‌ర‌కు విజువ‌ల్ గ్రాండియ‌ర్స్ ఎలా ఉంటాయో మ‌న ద‌ర్శ‌కులు చూపించారు కానీ హాలీవుడ్ రేంజ్ యాక్ష‌న్ స్టాండ‌ర్డ్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు సుజీత్ చూపించ‌డానికి రెడీ అవుతున్నాడు. 2019, ఆగ‌స్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా తెలుగు,హిందీ,తమిళంలో ఒకేసారి రిలీజ్ కాబోతుంది.మ‌రి ఈ సినిమాతో ప్రభాస్ కలను సుజిత్ ఎంతవరకు నెరవేరుస్తాడో చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: June 13, 2019, 11:26 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading