బాలీవుడ్లో అతితక్కువ కాలంలో హీరోయిన్గా ఆమె కంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది శ్రద్ధా కపూర్. ప్రస్తుతం ఈ భామ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ‘సాహో’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను ఈ ఏడాది ఆగష్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా రిలీజ్ కానుంది. ఈ సినిమాను ఒకేసారి నాలుగు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోన్న శ్రద్ధా త్వరలో వివాహం చేసుకోబోతున్నట్టు వార్తులు వస్తున్నాయి. కొంతకాలంగా శ్రద్ద రోహన్ శ్రేష్ఠఅనే ఫోటో గ్రాఫర్తో డేటింగ్లో ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. చాలా కాలంగా వీరిద్దరికి మంచి స్నేహం ఉంది. వీళ్లిద్దరు వచ్చే ఏడాది 2020లో వివాహం చేసుకోవాలనుకుంటున్నారట. ప్రస్తుతం శ్రద్ధ వయసు 32 ఏళ్లు. ఇక వీరిద్దరి పెళ్లికి ఇంట్లో వారు బలవంత పెడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే శ్రద్దా కపూర్ ఇంటివాళ్లు వీరిద్దరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. పెళ్లి కోసమే శ్రద్దా సైనా నెహ్వాల్ బయోపిక్ నుంచి పక్కకు తప్పుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ భామ సాహో తర్వాత చిచ్చోర్, ఏబీసీడీ 3 సినిమాల్లో నటిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Hindi Cinema, Prabhas, Saaho, Shraddha Kapoor, Telugu Cinema, Tollywood