హోమ్ /వార్తలు /సినిమా /

సోషల్ మీడియాలో రికార్డుల మోత మోగిస్తోన్న ప్రభాస్ ‘సాహో’..

సోషల్ మీడియాలో రికార్డుల మోత మోగిస్తోన్న ప్రభాస్ ‘సాహో’..

ప్రభాస్ సాహో ఫోటో

ప్రభాస్ సాహో ఫోటో

Prabhas Saaho | బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్.. సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమా చేస్తున్నాడు. దాాదాపు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళంలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈసినిమా ఫస్ట్ లుక్, ఫస్ట్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాలో శ్రద్దాకపూర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్‌ 2 కు సోషల్ మీడియాలో దుమ్ము దులిపేస్తోంది.

ఇంకా చదవండి ...

    బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్.. సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమా చేస్తున్నాడు. దాాదాపు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళంలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈసినిమా ఫస్ట్ లుక్, ఫస్ట్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాలో శ్రద్దాకపూర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్‌ 2 కు సోషల్ మీడియాలో దుమ్ము దులిపేస్తోంది. ఇప్పటికే ‘సాహో’ మూవీ 24 గంటల్లో 2.9 మిలియన్ లైక్స్ సాధించింది. ఒక రోజుల్లో ఈ స్థాయిలో వ్యూస్ రాబట్టిన మేకింగ్ వీడియోగా సాహో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.  మరోవైపు 24 గంటల్లో ఈసినిమా 12 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించింది. ఒక్క సోషల్ మీడియా ద్వారానే 79 మిలియన్ వ్యూస్ రాబట్టినట్టు సమాచారం. ఇక ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో ేనుంచి మంచి బిజినెస్ జరిగింది. ఓవర్సీస్‌లో ఈ సినిమా రైట్స్ అన్నిభాషలకు కలిపి రూ.42 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. మొత్తానికి రిలీజ్‌కు ముందు ఇంత హంగామా చేస్తోన్న ‘సాహో’ సినిమా..రిలీజ్ తర్వాత కలెక్షన్స్ పరంగా నిజంగానే సాహో అనిపిస్తుందా లేదా అనేది చూడాలి.

    First published:

    Tags: Prabhas, Saaho, Shraddha Kapoor, Telugu Cinema, Tollywood

    ఉత్తమ కథలు