ప్రభాస్ అభిమానులకు శుభవార్త.. ఇంతకీ ఏమిటంటే..

ప్రభాస్ తన ఫ్యాన్స్‌కు త్వరలో శుభవార్త చెప్పనున్నాడు. ఇంతకీ ఏమిటంటే..

news18-telugu
Updated: May 14, 2019, 3:41 PM IST
ప్రభాస్ అభిమానులకు శుభవార్త.. ఇంతకీ ఏమిటంటే..
ప్రభాస్ (ఫైల్ ఫొటో)
news18-telugu
Updated: May 14, 2019, 3:41 PM IST
ప్రభాస్ తన ఫ్యాన్స్‌కు త్వరలో శుభవార్త చెప్పనున్నాడు. ఇంతకీ ఏమిటంటే..ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు ఒకవైపు నటిస్తూనే ఇంకోవైపు బిజినెస్ లాంటి వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఆల్రెడీ చిరంజీవి, నాగార్జున వంటి సీనియర్  హీరోలు కూడా ‘స్టార్ మా’ లో భాగస్వాములుగా ఉన్నారు. ఇంకోవైపు మహేష్ బాబు కూడా AMB  సినిమాస్ అంటూ  మల్టీప్లెక్స్ బిజినెస్‌లో  ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలసిందే కదా. మరోవైపు అల్లు అర్జున్ కూడా మల్టీప్లెక్స్ బిజినెస్‌లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. తాజాగా ప్రభాస్ కూడా మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. దీంతో పాటు తన మిత్రులు వంశీ కృష్ణారెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్‌లతో కలిసి ప్రముఖ టీవీ ఛానెల్‌ పెట్టబోతున్నట్టు  సమాాచారం.అందులో ప్రభాస్ భాగస్వామిగా చేరబోతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్..సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఆగష్టు 15న విడుదల కానుంది. మరోవైపు రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక పీరియాడికల్ లవ్ స్టోరీచేస్తున్నాడు.

First published: May 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...