BAHUBALI FAME PRABHAS ANOTHER RECORD IN SOCIAL MEDIA PLATFORM FACEBOOK TA
Prabhas: మరోసారి ప్రభాస్ ముందు ఆ రికార్డులు ఫసక్..
ప్రభాస్ (File/Photo)
ఎపుడైతే.. రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి’ చిత్రాన్ని చేసాడో హీరోగా ప్రభాస్ క్రేజ్ లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవల్‌కి పెరిగింది. అంతేకాదు బాహుబలితో బాలీవుడ్ హీరోలకు కూడా సాధ్యం కానీ రికార్డులను తన వశం చేసుకున్నాడు. తాజాగా ప్రభాస్ ఖాతాలో మరో రికార్డు నమోదు అయింది.
ఎపుడైతే.. రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి’ చిత్రాన్ని చేసాడో హీరోగా ప్రభాస్ క్రేజ్ లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవల్‌కి పెరిగింది. అంతేకాదు బాహుబలితో బాలీవుడ్ హీరోలకు కూడా సాధ్యం కానీ రికార్డులను తన వశం చేసుకున్నాడు. ఆ తర్వాత ‘సాహో’ తో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసాడు.ఈ చిత్రం బ్యాడ్ టాక్‌తో కూడా కళ్లు చెదరే వసూళ్లను సాధించింది. ప్రస్తుతం ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్కు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ సినిమాల కోసం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అన్ని ఇండస్ట్రీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు బొమ్మగా కొలువైన ఫస్ట్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ హీరోగా రికార్డులకు ఎక్కాడు. ఇప్పటికే ఫేస్బుక్లో ఓ రికార్డు క్రియేట్ చేసిన ప్రభాస్..ఇపుడు మరో రికార్డుల మీద రికార్డులు నెలకొల్పుతున్నాడు.
ప్రభాస్ Photo : Twitter
ప్రభాస్.. ఫేస్బుక్లో ఫాలో అయ్యే వారి సంఖ్య 19 మిలియన్లు దాటి 20 మిలియన్స్ వైపు దూసుకుపోతుంది. ఇది కూడా కేవలం రెండు నెలల్లోనే దాదాపు 14 మిలియన్ నుంచి 20 మిలయిన్లకు చేరింది. ఈ రకంగా దక్షిణాదిలో ఫేస్బుక్లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న హీరోగా ప్రభాస్ రికార్డులకు ఎక్కాడు. ప్రస్తుతం ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ అే పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పదుకొణే హీరోయిన్గా నటిస్తోంది. మరోవైపు హిందీలో ఒక అగ్ర దర్శకుడి చిత్రంలో హృతిక్ రోషన్‌తో నటించడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.