Bahubali Collections : బాహుబలి కలెక్షన్స్ పై ఏపీ ప్రభుత్వం దర్యాప్తు.. ? టాక్స్ ఎగవేతపై ప్రభుత్వ సలహాదారు సజ్జల కామెంట్స్..

బాహుబలి కలెక్షన్స్ పై ఏపీ ప్రభుత్వ దర్యాప్తు (File/Photo)

Bahubali Collections : బాహుబలి కలెక్షన్స్ పై ఏపీ ప్రభుత్వం దర్యాప్తు.. ? టాక్స్ ఎగవేతపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దర్యాప్తుకు ఆదేశించినట్టు చెప్పారు.

 • Share this:
  Bahubali Collections : ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు.. రీసెంట్‌గా సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘రిపబ్లిక్’ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్.. ఏపీ ప్రభుత్వ తీరుపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు టిక్కెట్స్‌ను ఆన్‌లైన్‌లో ఏపీ ప్రభుత్వం  అమ్మాలనుకుంటున్న తీరును తూర్పారా పట్టారు. అంతేకాదు సినీ నటులు కష్టపడితేనే డబ్బులు వస్తాయి. మేము కాంట్రాక్టులతో కోట్లు దండుకోవడం లేదంటూ ఏపీ ప్రభుత్వ పెద్దలు అన్యాయంగా సంపాదిస్తున్నరంటూ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై పోసాని కృష్ణమురళి అదే రేంజ‌్‌లో కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ కొంత మంది పోసానిపై హైదరాబాద్‌లో ప్రెస్‌క్లబ్‌లో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే కదా.

  ఆ సంగతి పక్కన పెడితే.. పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వం చేసిన కామెంట్స్‌కు మాకు సంబంధం లేదంటూ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. మరోవైపు కొంతమంది నటీనటులు ఇది పవన్ కళ్యాణ్ వ్యక్తిగత అభిప్రాయం అని చెబుతున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి బాహుబలి సహా పలువురు హీరోలు నటించిన సినిమాల కలెక్షన్స్ పై దర్యాప్తు చేయనున్నట్టు ప్రకటించి సంచలనం రేపారు.

  Ranbir Kapoor - Alia Bhatt : రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్నారా.. ?


  ఈ సందర్భంగా ఎవరు ప్రభుత్వానికి సరిగా టాక్స్ కట్టారు. ఎవరు ఎగ్గొట్టారనే విషయం ఈ సందర్భంగా నిగ్గు తేలుందని చెబుతున్నారు. మరోవైపు సజ్జల మాట్లాడుతూ.. ఒకప్పుడు ఎన్టీఆర్ నటించిన సినిమాకైనా.. రాజబాబు హీరోగా యాక్ట్ చేసిన సినిమాకైనా ఒకే రేటు ఉండేదన్నారు. సినిమా బాగుంటే ఎక్కువ రోజులు ఆడేవన్నారు. ఇపుడు టిక్కెట్ ధరను ఏకంగా రూ. 500 వరకు పెంచేసుకుంటున్నారు. అంతేకాదు ప్రీమియర్ షోలంటూ అభిమానుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారని విమర్శించారు.

  Puri Jagannadh Introduced Heroines: రేణు దేశాయ్, అనుష్క, అసిన్ సహా పూరీ జగన్నాథ్ టాలీవుడ్‌కు పరిచయం చేసిన హీరోయిన్స్ వీళ్లే..


  దీంతో వారం రోజుల్లో పెట్టిన పెట్టుబడులు రాబట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. తెలుగు సినీ పరిశ్రమకు పవన్ కళ్యాణ్ ఓ గుదిబండగా మారారని విమర్శించారు. ఆయన సినిమాకు తీసుకునేది రూ. 50 కోట్లు... లెక్కల్లో చూపించేది రూ. 10 కోట్లు. ఇలా ప్రభుత్వాన్ని మోసం చేస్తోన్న వారిపై కూడా త్వరలోనే చర్యలు తీసుకోబోతున్నట్టు చెప్పారు.

  Allu Arjun - Allu Sneha : భార్య స్నేహా రెడ్డి పుట్టినరోజున అపురూప కానుక ఇచ్చిన అల్లు అర్జున్..


  బాహుబలి సినిమా విషయంలో సగం డబ్బులు ప్రభుత్వానికి, డిస్ట్రిబ్యూటర్స్‌కు వెళ్లలేదన్నారు. ఆన్‌లైన్ విధానంలో అయితే..  అక్కడికక్కడే ఎవరికి వెళ్లాల్సిన డబ్బులు వారికి వెళ్లిపోతాయన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానం వల్ల.. ఎన్టీఆర్ సినిమా అయినా.. కాంతారావు సినిమా అయినా టిక్కెట్ రేట్ ఒకే విధంగా ఉంటుందన్నారు. ప్రేక్షకులకు సరసమైన ధరకు ఎంటర్టైన్మెంట్ లభిస్తుంది ఇలా తక్కువ రేటుకు ప్రజలకు వినోదం అందించే ప్రయత్నం చేస్తుంటే.. పవన్  కళ్యాణ్ ఎందుకు వద్దంటున్నారో చెప్పాలన్నారు. సినిమా టికెట్ల వల్ల ప్రభుత్వానికి ఎక్కువలో ఎక్కువ రూ. 200 కోట్లు వస్తాయన్నారు. దీంతో ప్రభుత్వానికి ఏం ఒరిగేది లేదన్నారు.  ఇంతేసి డబ్బులతో  ప్రభుత్వం బ్యాంకుల దగ్గర అప్పు తీసుకుంటుందా అని ఒకింత ఆశ్యర్యం వ్యక్తం చేశారు.

  Posani - Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన పోసాని.. ఆ హీరోయిన్‌కు న్యాయం చేయండి అంటూ..


  ఇక రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రానా ప్రతినాయకుడిగా నటించిన ‘బాహుబలి’ సినిమా టికెట్ల కలెక్షన్ల విషయంలో సినిమా విడుదలైన ఫస్ట్ వీక్‌లోనే సగం రెవెన్యూ గవర్నమెంట్‌తో పాటు డిస్ట్రిబ్యూటర్స్‌కు వెళ్లలేదని సజ్జల ఆరోపించారు. సినిమా విడుదలైన తొలి వారంలోనే సగం సీట్లు ఖాళీగా ఉన్నట్లునిర్మాతలు చూపించారు. ఈ సినిమాతో పాటు మిగతా సినిమాల కలక్షన్స్‌లో ఏది నిజమైన కలెక్షన్స్... ఏది ఫేక్ అనే దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనున్నట్టు తెలిపారు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: