మళ్లీ సైజ్ జీరో అంటున్న అనుష్క .. కొత్త లుక్‌తో షాకిచ్చిన స్వీటీ..

బొద్దుగా మారిన అనుష్క

Anushka Shetty: సైజ్ జీరో సినిమా కోసం బొద్దుగా మారిన అనుష్క.. ఆ తర్వాత సన్నగా మారేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. అయినా లాభం లేకపోయింది. దీంతో బాహుబలి తొలి పార్టులో సన్నగా కనిపించిన స్వీటీ.. రెండో పార్టులో బొద్దుగా కనిపించింది.

  • Share this:
    తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తియ్యని ప్రేమ రాగాలు మీటింది.. ఈ స్వీటీ. నటనలో విభిన్న కోణాలను చూపుతూ అరుంధతిలా అలరించింది.. దేవసేనగా మారి బాహుబలిని తన కౌగిలిలో బంధించింది.. అనుష్క శెట్టి. ఒకప్పుడు నాజూగ్గా ఉండే ఈ బ్యూటీ సినిమాల్లో తన అందచందాలను, ఒంపుసొంపులను ప్రదర్శించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అయితే, సైజ్ జీరో సినిమా కోసం బొద్దుగా మారిన అనుష్క.. ఆ తర్వాత సన్నగా మారేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. అయినా లాభం లేకపోయింది. దీంతో బాహుబలి తొలి పార్టులో సన్నగా కనిపించిన స్వీటీ.. రెండో పార్టులో బొద్దుగా కనిపించింది. అయితే ఇటీవ‌ల సెలబ్రిటీ ఫిట్‌నెస్ ట్రైనర్ ల్యూక్ కౌటిన్హో ఆమెను నాజూగ్గా మార్చేశారు. ఆమె ఫిగర్ చూసి అంతా అనుష్క ఈజ్ బ్యాక్ అనుకున్నారు. అయితే, తాజాగా ఆమె ఓ కొత్త లుక్‌లో కనిపించి అందరికి షాక్ ఇచ్చింది.

    మ‌ళ్ళీ బొద్దుగా మారి సైజ్ జీరో లుక్‌నే గుర్తు చేసింది. దీనికి సంబంధించిన అనుష్క ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్కర్లు కొడుతున్నాయి. కొద్ది రోజులుగా సైలెంట్ (నిశ్శబ్ధం) సినిమా కోసం అమెరికాలో ఉంటున్న అనుష్క రీసెంట్‌గా హైద‌రాబాద్‌కి వ‌చ్చింది. ఈ సందర్భంగా ఆమెను ఎవరో ఫోటో తీశారు. ఆ ఫోటో ఇంటర్నెట్‌లో పోస్ట్ చేయగా.. అరే! అనుష్క మళ్లీ బొద్దుగా మారిపోయిందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఫోటోను మాత్రం బీభత్సంగా షేర్ చేస్తున్నారు.
    First published: