బ్యాంకాక్‌లో బట్టలమ్ముతోన్న బాహుబలి నటి..వైరలవుతోన్న వీడియో

'బాహుబలి- ది బిగినింగ్' సినిమాలో 'మనోహరి' పాట ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఆ పాటలో వయ్యారాలు పోతూ..కుర్రకారుకు మతిపోయేలా డ్యాన్స్ చేసిన నటి నోరా ఫతేహి. ఈ భామ బ్యాకాంక్ వీధుల్లో బట్టలు అమ్ముతోంది. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్‌గా మారింది.

news18-telugu
Updated: June 11, 2019, 3:13 PM IST
బ్యాంకాక్‌లో బట్టలమ్ముతోన్న బాహుబలి నటి..వైరలవుతోన్న వీడియో
బాహుబలి పోస్టర్.. Photo: Twiiter
news18-telugu
Updated: June 11, 2019, 3:13 PM IST
'బాహుబలి- ది బిగినింగ్' సినిమాలో 'మనోహరి' పాట ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఆ పాటలో వయ్యారాలు పోతూ..కుర్రకారుకు మతిపోయేలా డ్యాన్స్ చేసిన నటి నోరా ఫతేహి. తెలుగులో 'టెంపర్'  'కిక్‌2', 'లోఫర్', 'ఊపిరి' చిత్రాల్లో ఐటమ్ నంబర్స్‌కు డ్యాన్స్‌లు చేసింది. ఇటూ తెలుగులో చేస్తూనే అటూ హిందీలో కూడా ఇరగదీస్తోంది. అందులో భాగంగా.. ఇటీవల విడుదలైన సల్మాన్ ఖాన్ 'భారత్' సినిమాలో కనిపించింది. అయితే తాజాగా ఈ అమ్మడు బ్యాంకాక్‌లో బట్టలు అమ్ముకుంటున్న ఓ వీడియో సంచలనంగా మారింది. తెలుగు, హిందీ సినిమాల్లో మంచి డ్యాన్సర్‌గా, నటిగా పేరు సంపాదించిన నోరా బ్యాంకాక్ మార్కెట్‌లో నేల మీద కూర్చుని దుస్తులను విక్రయిస్తోంది. ఆ వీడియోలో ఆమె ఏమాత్రం మేకప్ వేసుకోకుండా ఉండడంలో..నిజంగా సేల్స్‌గర్ల్ మాదిరిగానే ఉంది. ఆమె చుట్టూ కొన్ని దుస్తులు ఉన్నాయి. 
Loading...

View this post on Instagram
 

Ramadan Mubarak everyone! 🕌 ❣ 🥰كل عام وأنتم بخير Praying for peace all over the world and for everyones fasts and prayers to be accepted 🙏🏽 —————————————————————— Photo @rahuljhangiani Makeup @marcepedrozo Styling @tanghavri


A post shared by Nora Fatehi (@norafatehi) on

చేతిలో కొన్ని దుస్తులు పట్టుకొని నోరా.. వినియోగదారులతో అక్కడి స్థానిక బాషలోనే మాట్లాడుతోంది. ఓ ట్రిప్ కోసం బ్యాంకాక్ వెళ్లిన నోరా అలా బ్యాంకాక్ వీధుల్లో ఎంజాయ్ చేస్తోంది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


First published: June 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...