• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • BADRI 21 YEARS RENU DESAI SHARES A ROMANTIC PIC FROM BADRI SHOOTING PIC GOES VIRAL SR

Pawan Kalyan | Renu Desai : పవన్ కళ్యాణ్‌తో రొమాంటిక్ పిక్‌ను షేర్ చేసిన రేణు దేశాయ్..‌ పిక్ వైరల్..

Pawan Kalyan | Renu Desai : పవన్ కళ్యాణ్‌తో రొమాంటిక్ పిక్‌ను షేర్ చేసిన రేణు దేశాయ్..‌ పిక్ వైరల్..

రేణు దేశాయ్ (Instagram/Photo)

Pawan Kalyan | Renu Desai : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా బద్రి. ఈ సినిమా ఈరోజుతో 21 ఏళ్లు పూర్తి చేసుకుంది.

  • Share this:
    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా బద్రి. పవన్ కళ్యాణ్ అప్పటికే ఐదు సినిమాలు చేసి పీక్ స్టేజ్‌లో ఉన్నాడు. వరుసగా సుస్వాగతం, తమ్ముడు లాంటీ బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత స్టైలీష్ లుక్‌లో వచ్చి మరో హిట్ కొట్టాడు పవన్. పూరి జగన్నాధ్‌కు ఈ సినిమా మొదటి సినిమా. ఈ సినిమా తర్వాత పూరి జగన్నాధ్ ఇక వెనుతిరిగి చూడలేదు. వరుసగా సినిమాలు చేసుకుంటూ స్టార్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరాడు. 2000వ సంవత్సరంలో వచ్చిన బద్రిలో ఇద్దరూ హీరోయిన్స్ నటించారు. హిందీ హీరోయిన్ అమిషా పటేల్, రేణు దేశాయ్. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్‌తో లవ్‌లో పడడం.. ఆ తర్వాత కొంత కాలం సహజీవనం.. ఆ తర్వాత పెళ్లి.. ఇద్దరు పిల్లలు.. ఇక ఏవో కారణాల వల్ల ప్రస్తుతం ఇద్దరు వేరుగా ఉంటోన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ వేరే పెళ్లి చేసుకోగా.. రేణు దేశాయ్ మాత్రం పిల్లలతో ఒంటరిగానే జీవిస్తోంది.  ఇదంతా అలా ఉంటే ఈరోజుతో బద్రి సినిమా వచ్చి 21 ఏళ్ళు పూర్తి కావడంతో అప్పటి ఓ బ్యూటిఫుల్ ఫోటోను షేర్ చేసింది ఆ సినిమాలో హీరోయిన్‌గా చేసిన రేణు దేశాయ్.

    ఈ సినిమాలో హిట్ సాంగ్ “హే చికితా” షూట్ లో గన్ పట్టుకొని ఉన్న పవన్ ముందు దుప్పట్టాలో తాను ఉన్న ఫోటోను షేర్ చేసి అప్పటి మెమొరీస్ గుర్తు చేసుకుంది రేణు దేశాయ్. దీంతో ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. ఓ వైపు ఏపీ రాజకీయాల్లో రాణిస్తూనే మరోవైపు ఇటు సినిమాల్లో కూడా అదరగొడుతున్నాడు. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలకు మరింత సమయం ఉండటంతో ఈ లోగా వరుసగా చిత్రాలను అంగీకరిస్తున్నాడు. అందులో భాగంగా అప్పటికే పలు సినిమాలతో ఆయన చాలా బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఆయన నటించిన పింక్ సినిమా తెలుగు రీమేక్ వకీల్ సాబ్ విడుదలైంది. ఈ సినిమాకు  శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించాడు. పవన్ కళ్యాణ్‌కు జోడిగా శృతి హాసన్‌ నటించింది.








    View this post on Instagram






    A post shared by renu (@renuudesai)




    ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తొలిసారి లాయర్ పాత్రలో నటించాడు. ఇక మరోవైపు పవన్ కళ్యాణ్.. మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను రీమేక్ చేస్తున్నాడు. రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తోన్నాడు. త్రివిక్రమ్ మాటలు అందిస్తోన్న ఈ చిత్రానికి సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ పూర్తిగా కమర్షియల్ అంశాలతో రాసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్  లెక్చరర్‌గా కనిపించనున్నాడట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్‌ కూడా పూర్తైంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది టీమ్. ఈ సినిమా అక్టోబర్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. పవన్ ప్లాష్ బ్యాక్ లో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడట. మరో పాత్రలో లెక్చరర్‌గా ఉంటాడట. ఈ సినిమాలో పవన్ డబుల్ రోల్‌లో కనిపిస్తాడట.

    వీటికి తోడు పవన్ కళ్యాణ్.. క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వ‌జ్రాల దొంగగా క‌నిపించ‌నున్నాడ‌ని అంటున్నారు. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఏ ఎం రత్నం నిర్మాత వ్యవహరిస్తున్నాడు. ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. వచ్చే సంవత్సరం అంటే 2022 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్‌లో అన్ని భాషాల్లో విడుదల కానుంది.
    Published by:Suresh Rachamalla
    First published: