పివి సింధు బయోపిక్‌లో దీపిక పదుకొనే.. బాలీవుడ్‌లో మరో సంచలనం..

ఇండస్ట్రీ ఏదైనా కానీ ఇప్పుడు అన్నిచోట్లా బయోపిక్స్ ట్రెండ్ నడుస్తుంది. కథలు కొత్తగా రాయడం మానేసి.. జీవితాలనే కథలుగా మార్చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 3, 2019, 6:26 PM IST
పివి సింధు బయోపిక్‌లో దీపిక పదుకొనే.. బాలీవుడ్‌లో మరో సంచలనం..
పివి సింధు దీపిక పదుకొనే (Source: Twitter)
  • Share this:
ఇండస్ట్రీ ఏదైనా కానీ ఇప్పుడు అన్నిచోట్లా బయోపిక్స్ ట్రెండ్ నడుస్తుంది. కథలు కొత్తగా రాయడం మానేసి.. జీవితాలనే కథలుగా మార్చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. తాజాగా మరో బయోపిక్ కూడా రాబోతుందని తెలుస్తుంది. అది ఎవరిదో కాదు.. బ్యాడ్మింటన్ సంచలనం పివి సింధు. ఈ మధ్య ప్రపంచ ఛాంపియన్ షిప్ గెలుచుకుని వరల్డ్ వైడ్ ట్రెండ్ అయిన ఈ భామ బయోపిక్ చేయడానికి బాలీవుడ్‌లో పావులు కదుపుతున్నారు దర్శక నిర్మాతలు. ఇదే చర్చ ఇండస్ట్రీలో జరుగుతుంది కూడా. అయితే ఈ విషయంపై తన బయోపిక్‌లో ఎవరు నటిస్తే బాగుంటుందని పివి సింధును కూడా అడిగారు మీడియా మిత్రులు.

దానికి మరో ఆలోచన లేకుండా దీపిక పదుకొనే అనే సమాధానం ఇచ్చింది ఈమె. దానికి కారణం కూడా లేకపోలేదు. ఒకప్పుడు దీపిక కూడా బ్యాడ్మింటన్ ప్లేయరే.. పైగా ఆమె తండ్రి ప్రకాశ్ పదుకొనే ఒకప్పుడు ఇండియాకు మెడల్ కూడా తీసుకొచ్చాడు. దాంతో అలవాటు ఉన్న గేమ్ కాబట్టి తన పాత్రలో దీపిక అయితే బాగుంటుందని చెప్పింది సింధు. మరోవైపు పుల్లెల గోపీచంద్ పాత్రలో ఎవరు నటిస్తే బాగుంటుందనే వాదనకు తెరతీస్తూ.. అక్షయ్ కుమార్ అనే సమాధానం వచ్చింది. మొత్తానికి పివి సింధు బయోపిక్ ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయిపోయింది.

First published: September 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు