అక్కినేని కోడలు సమంతకు అనుకోని షాక్.. ఇంతకీ ఏం జరిగిందంటే..

అక్కినేని కోడలు సమంత వరస విజయాలతో దూసుకుపోతుంది. తాజాగా ఈ ఇయర్ ఈ భామ తన భర్త నాగ చైతన్యతో నటించిన ‘మజిలీ’తో పాటు ‘ఓ బేబి’ సక్సెస్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఈ భామ.. మన్మథుడు 2లో చిన్నపాత్రలో మెరిసింది. తాజాగా ఈ భామకు అనుకోని షాక్ తగిలింది.

news18-telugu
Updated: September 6, 2019, 7:55 AM IST
అక్కినేని కోడలు సమంతకు అనుకోని షాక్.. ఇంతకీ ఏం జరిగిందంటే..
సమంత (Instagram/samantharuthprabhuoffl
  • Share this:
అక్కినేని కోడలు సమంత వరస విజయాలతో దూసుకుపోతుంది. తాజాగా ఈ ఇయర్ ఈ భామ తన భర్త నాగ చైతన్యతో నటించిన ‘మజిలీ’తో పాటు ‘ఓ బేబి’ సక్సెస్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఈ భామ.. మన్మథుడు 2లో చిన్నపాత్రలో మెరిసింది. తాజాగా ఈ భామకు అనుకోని షాక్ తగిలింది. ప్రస్తుతం సమంత ప్రధాన పాత్రలో భారత బాడ్మింటన్ స్టార్ పి.వీ.సింధు పాత్రలో నటించబోతున్నట్టు గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేసాయి. తాజాగా పి.వి.సింధు దశాబ్దాల కాలంగా భారతీయులకి అందని ద్రాక్షగా మిగిలిపోయిన వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌‌ బంగారు పతకాన్ని పీవీ సింధు ఇటీవల సగర్వంగా ముద్దాడింది. ఐతే  తెలుగు తేజం పీవీ సింధు బయోపిక్‌ను తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నటుడు సోనూ సూద్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

పి.వి.సింధు బయోపిక్‌లో సమంత (File/Photo)


ఈ నేపథ్యంలో ప్రముఖ నటి సమంత తెరపై సింధుగా కనిపించనున్నారనే వార్తలు వినిపించాయి.ఐతే ఇటీవలే పి.వి.సింధు మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగా కొంత మంది విలేఖరులు మీ బయోపిక్‌ను తెరకెక్కిస్తే.. మీ పాత్రలో ఎవరు నటిస్తే బాగుంటుందని ప్రశ్నించారు. దీనికి సింధు సమాధానమిస్తూ..బాలీవుడ్‌ భామ దీపికా పదుకోనే తన పాత్రలో నటిస్తే బాగుంటుందని చెప్పింది. అంతేకాదు దీపికా బ్యాడ్మింటన్‌ బాగా ఆడుతుందని అంతకు మించిన మంచి నటి కూడా అని కితాబిచ్చాంది. అయితే ఈ విషయంలో నిర్మాతలు, దర్శకులదే చివరి నిర్ణయం అంటూ తెలిపింది. కాగా, దీపికా తండ్రి ప్రకాశ్‌ పదుకోన్‌ మాజీ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ అన్న సంగతి తెలిసిందే. దీపికా కూడా టీనేజీలో జాతీయ స్థాయి బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో రాణించింది.ప్రస్తుతం దీపికా కబీర్‌ఖాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్‌ డ్రామాలో నటిస్తుంది. ఈ చిత్రంలో జనవరి 2020లో ప్రేక్షకులు మందుకు రానుంది. మరి సింధు వ్యాఖ్యలతో సమంత..పి.వి.సింధు పాత్రలో నటిస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్టైయింది.
Published by: Kiran Kumar Thanjavur
First published: September 6, 2019, 7:55 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading