వెనకడుగు వేసిన జేమ్స్‌బాండ్.. కొత్త రిలీజ్ డేట్ ఎపుడంటే..

ప్రపంచ వ్యాప్తంగా యాక్షన్ ప్రేమికులకు ఎక్కువగా ఇష్టపడే సినిమాల్లో జేమ్స్‌బాండ్ మూవీస్ ముందు వరసలో వుంటాయి. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు 24 సినిమాలు వచ్చాయి. ఇపుడీ సిరీస్‌లో 25వ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా విడుదల తేది మరోసారి మారింది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 20, 2019, 9:20 AM IST
వెనకడుగు వేసిన జేమ్స్‌బాండ్.. కొత్త రిలీజ్ డేట్ ఎపుడంటే..
జేమ్స్ బాండ్ డేనియల్ క్రేగ్ (ఫైల్ ఫోటో)
  • Share this:
అతడు చేసే అడ్వెంచర్లకు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్. రహస్యాలను ఛేదించడంలో అతడికతడే సాటి. ట్రిగ్గర్ మీద వేలు పెట్టాడంటే ఆడియన్స్‌లో నరాలు తెగే ఉత్కంఠ.అతడే బాండ్..జేమ్స్ బాండ్. 007గా ఇంకా ఫేమస్.

ప్రపంచ వ్యాప్తంగా యాక్షన్ ప్రేమికులకు ఎక్కువగా ఇష్టపడే సినిమాల్లో జేమ్స్‌బాండ్ మూవీస్ ముందు వరసలో వుంటాయి. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు 24 సినిమాలు వచ్చాయి. ఇపుడీ సిరీస్‌లో 25వ సినిమా తెరకెక్కుతోంది. ఇపుడీ ప్రాజెక్ట్ నుంచి ఈ మూవీ డైరెక్టర్ డేని బాయ్‌లే పక్కకు తప్పుకున్నాడు. నిజానికి జేమ్స్‌బాండ్ అంటే బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్. ఆ సినిమాలన్ని బ్రిటిష్ సినిమాలనే చెప్పాలి.  డేని బాయిల్  ప్లేస్‌లో క్యారీ జోజి వచ్చాకా ఈ ఇయర్ నవంబర్‌లో విడుదల కావాల్సిన ఈ సినిమా  వచ్చే యేడాది ఫిబ్రవరి 14కు వాయిదా పడింది.

తాజాగా ఈ సినిమా మరోసారి వాయిదా పడి 8 ఏప్రిల్ 2020న విడుదల కానున్నట్టు జేమ్స్ బాండ్ చిత్ర నిర్మాతలు అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ సినిమాలో డేనియల్ క్రేగ్ హీరోగా నటిస్తున్నాడు. జేమ్స్‌బాండ్‌గా అతనికిది ఐదో సినిమా. మార్చి 4  ఈసినిమా చిత్రీకరణ మొదలుకానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం కంప్లీటైంది. మరోవైపు ఫ్యాస్ట్ అండ్ ప్యూరియస్ 9 చిత్రాన్ని 10 ఏప్రిల్ 2020 కాకుండా మే 22కు పోప్ట్ పోన్ చేస్తున్నట్టు యూనివర్సల్ సంస్థ ప్రకటించిన కొద్ది సేపటికే బాండ్ చిత్ర నిర్మాతలు  చిత్ర  విడుదల తేదిపై అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ సిరీస్ తర్వాత జేమ్స్ బాండ్ సినిమాలకు డేనియల్ క్రేగ్ గుడ్‌బై చెప్పనున్నాడు.

శృతిహాపన్ లేటెస్ట్ ఫోటోస్ 
ఇవి కూడా చదవండి 

పేరు మార్చుకుని మరీ వస్తోన్న తమిళ అర్జున్ రెడ్డి..ఈ సారి ఈ పేరంటే...విజయ్ దేవరకొండ దర్శకుడితో నాగ చైతన్య కొత్త సినిమా..

ఆయన నాతో ఎప్పుడూ కలసి లేరు..ఆలియా భట్ సంచలన వ్యాఖ్యలు
First published: February 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>