Bachchan Family : బచ్చన్ ఫ్యామిలీ మళ్లీ దివాళా తీసిందా.. ఆస్తులను అమ్ముకుంటున్న అభిషేక్, ఐశ్వర్య దంపతులు. వివరాల్లోకి వెళితే.. అమితాబ్ బచ్చన్ గతంలో ABCL కార్పోరేషన్ బ్యానర్ పై పలు చిత్రాలను నిర్మించి ఆర్ధికంగా చితికి పోయారు. అంతేకాదు అప్పట్లో ఓ అందాల పోటీకి నిర్వాహకులుగా వ్యవహరించడం కూడా అమితాబ్ బచ్చన్ ఫైనాన్షియల్‌గా చితికి పోవడాకి ఓ కారణం అని చెబుతారు. ఆ తర్వాత కేబీసీ ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా వ్యవహరించడంతో పాటు సెకండ్ ఇన్నింగ్స్‌లో అద్భుతమైన పాత్రలతో పోయిన ఆస్తులను తిరిగి కూడా బెట్టుకున్నారు. కట్ చేస్తే.. అమితాబ్ బచ్చన్ నట వారసుడిగా అభిషేక్ బచ్చన్ బాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బీ తరహాలో కాకుండా ఓ మోస్తరు హీరోగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
ఈయన తన సహ నటి ఐశ్వర్య రాయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్లిద్దరు కలిసి ‘గురు’, ‘డాయి అక్షర్ ప్రేమ్ కే’, ‘రావన్’, ‘ఉమ్రావ్‌జాన్’, ‘కుచ్నా కహో’, హ్యాపీ యానివర్సరీ’, ‘గులాబ్ జామున్’ వంటి చిత్రాల్లో నటించారు. వీళ్లిద్దరు తాజాగా తమకు సంబంధించిన ఓ లగ్జరీ ఫ్లాట్‌ను అమ్మేసినట్టు సమాచారం. ముంబైలోని ఒబెరాయ్ 360 వెస్ట్‌లో ఈ లగ్జరీ ఫ్లాట్‌ను వీళ్లు 2014లో రూ. 41 కోట్లతో కొనుగోలు చేసినట్టు సమాచారం. తాజాగా ఈ ప్రాపర్టీని రూ. 45.75 కోట్లకు అమ్మేసారట. దానికి సంబంధించిన క్రయ విక్రయాలకు సంబంధించిన సమాచారం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.
ముంబైలోని వర్లి ప్రాంతంలో ఉన్న ఒబెరాయ్ 360లో పడమర దిశగా 37 అంతుస్తుల్లో ఈ ఫ్లాట్ ఉంది. ఇది 7,527 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎంతో విశాలంగా ఉంది. ఇదే అంతస్తులో అక్షయ్ కుమార్, షాహిద్ కపూర్ సహా పలువరు బాలీవుడ్ హీరోలకు ప్లాట్స్ ఉన్నాయట. షాహిద్ ఇదే అపార్ట్మెంట్లో తన ఫ్లాట్ కోసం రూ. 53 కోట్లకు కొనుగోలు చేశారట. అక్షయ్ కుమార్ దాదాపు 52 .5 కోట్లకు కొన్నారు. ఎంతో డిమాండ్ ఉన్న ఈ స్థలంలో అభిషేక్ బచ్చన్ దంపతులు అంత తక్కువ ధరకు ఫ్లాట్ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏంటని బాలీవుడ్ మీడియా చెవులు కొరుక్కుటోంది. మరి అభిషేక్, ఐశ్వర్యలు సినిమాలు లేక తమ ఫ్లాట్‌ను అమ్ముకున్నారా.. లేకపోతే.. వాస్తు బాగాలేక దీన్ని విక్రయించారా అనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతం అమితాబ్ .. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ ఆర్ధిక పరిస్థితి బాగానే ఉంది. ఇలాంటి నేపథ్యంలో అభిషేక్ తన ఫ్లాట్‌ను అమ్ముకోవడం బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇవి కూడా చదవండి..
Pawan Kalyan - Rana : పవన్ కళ్యాణ్, రానా మూవీ నుంచి అదిరిపోయిన క్రేజీ అప్డేట్..
అప్పటి తరంలో శ్రీదేవి.. ఈ తరంలో కాజల్, తమన్నా..
Kajal Aggarwal : వరంగల్‌లో సందడి చేసిన కాజల్ అగర్వాల్.. ఫోటోస్ వైరల్..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Abhishek Bachchan, Aishwarya Rai Bachchan, Amitabh bachchan, Bollywood news, Tollywood