BABU MOHAN WAS THE MAIN REASON FOR LATE LEGENDARY ACTRESS SOUNDARYA STARDOM PK
సౌందర్య, బాబు మోహన్ మధ్య రిలేషన్ ఏంటో తెలుసా..?
సౌందర్య బాబు మోహన్ (soundarya babu mohan)
Soundarya Babu Mohan: సౌందర్య స్టార్ హీరోయిన్.. బాబు మోహన్ కమెడియన్.. ఈ ఇద్దరి మధ్య రిలేషేన్ ఏంటి అనుకుంటున్నారా..? అవును నిజమే.. సౌందర్య అంత పెద్ద స్టార్ అయిందంటే కారణం బాబు మోహన్.
సౌందర్య స్టార్ హీరోయిన్.. బాబు మోహన్ కమెడియన్.. ఈ ఇద్దరి మధ్య రిలేషేన్ ఏంటి అనుకుంటున్నారా..? అవును నిజమే.. సౌందర్య అంత పెద్ద స్టార్ అయిందంటే కారణం బాబు మోహన్. అందుకే చనిపోయే వరకు కూడా ఈ కమెడియన్‌కు తన కృతజ్ఞత చూపిస్తూనే ఉంది సౌందర్య. ఈ స్టోరీ గురించి తెలియాలంటే ఓ 30 ఏళ్ల వెనక్కి వెళ్లాల్సిందే. అప్పట్లో మెడిసిన్ సీట్ సంపాదించి కన్నడ మ్యూజిక్ డైరెక్టర్, సౌందర్య తండ్రి సత్యనారాయణ మిత్రుడు హంసలేఖ ఇంటికి స్వీట్ ఇవ్వడానికి వెళ్లినపుడు.. అక్కడ ఆయన తనను చూసి గంధర్వ సినిమాలో అవకాశం ఇచ్చాడు.
సౌందర్య (soundarya)
అదే సౌందర్య తొలి సినిమా. ఆ సమయంలోనే త్రిపురనేని చూసి తను కృష్ణతో చేస్తున్న సినిమాలో సౌందర్యను హీరోయిన్గా తీసుకున్నాడు. కానీ ఆ సినిమా కంటే ముందే మనవరాలి పెళ్లి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు 16 ఏళ్ళ వయసులో పరిచయమైంది సౌందర్య. ఆ వెంటనే అమ్మోరు సినిమా కోసం ఫ్రెష్ ఫేస్‌ను నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి వెతుకుతున్నపుడు.. తను నటిస్తున్న మనవరాలి పెళ్లి సినిమాలోని సౌందర్యను రిఫర్ చేసాడు బాబు మోహన్. అంతేకాదు చాలా బాగా నటిస్తుందని సౌందర్య గురించి చెప్పడం.. వెంటనే శ్యామ్ ప్రసాద్ రెడ్డి వచ్చి సౌందర్యను చూసి తను నిర్మిస్తున్న అమ్మోరు సినిమాలో తీసుకోవడం జరిగిపోయాయి.
అమ్మోరు సినిమాలో సౌందర్య (soundarya ammoru)
అయితే అనివార్య కారణాలతో 1992లో మొదలైన అమ్మోరు 1995లో విడుదలైంది. కానీ అప్పటికే మనవరాలి పెళ్లి సినిమాకు రైటర్‌గా పని చేస్తున్న దివాకర్ బాబు రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాకు రిఫర్ చేసాడు. ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన తొలి సినిమా ఇది. ఈ సినిమా బ్లాక్ బస్టర్. ఆ వెంటనే ఇవివి తన హలో బ్రదర్ కోసం సౌందర్యను ఎంచుకున్నాడు. అది సంచలన విజయం సాధించింది. ఆ వెంటనే పెదరాయుడు కూడా వచ్చేసింది. అలా ఎన్ని సినిమాలు చేసినా కూడా సదరు హీరోయిన్గా మాత్రమే ఉన్న సౌందర్యను స్టార్ హీరోయిన్గా మార్చేసిన సినిమా మాత్రం అమ్మోరు.
సౌందర్య బాబు మోహన్ (soundarya babu mohan)
అందులో అమ్మవారి కూతురు భవానిగా సౌందర్య నటన అజరామరం. ఈ సినిమా విడుదలైన తర్వాత సౌందర్య గురించే ఇండస్ట్రీ అంతా మాట్లాడుకున్నారు. అమ్మోరులో బాబు మోహన్ కూడా నటించాడు. అలా అమ్మోరులో సౌందర్యకు అవకాశం రావడానికి కారణం బాబు మోహన్. అందుకే సౌందర్య తండ్రి సత్యనారాయణ కూడా చనిపోయే వరకు కూడా బాబు మోహన్‌కు ప్రత్యేకమైన గౌరవం ఇచ్చేవారు. కమెడియన్ అయినా కూడా మాయలోడు సినిమాలో ఆయనతో కలిసి రెయిన్ సాంగ్ చేసింది సౌందర్య. బాబు మోహన్‌తో ఈ పాట చేయడం వెనక కారణం కూడా అదే. అలా సౌందర్య కెరీర్‌ను మార్చేసిన అమ్మోరు వెనక బాబు మోహన్ హస్తం ఉంది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.