రాజమౌళికి నాకు బేదాభిప్రాయాలు ఉన్నాయి.. జక్కన్నపై తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఇప్పటి వరకు టాలీవుడ్‌లో అపజయం అంటూ ఎరగని దర్శకుడిగా రాజమౌళి రికార్డుకు ఎక్కాడు. సినిమా సినిమాకు దర్శకుడిగా తనను తాను మెరుగుపరుచుకుంటూ తెలుగు సినిమా స్థాయిని పెంచాడు జక్కన్న.తాజాగా కొడుకు సక్సెస్‌పై విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 22, 2019, 3:37 PM IST
రాజమౌళికి నాకు బేదాభిప్రాయాలు ఉన్నాయి.. జక్కన్నపై తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు..
విజయేంద్ర ప్రసాద్,రాజమౌళి
  • Share this:
ఇప్పటి వరకు టాలీవుడ్‌లో అపజయం అంటూ ఎరగని దర్శకుడిగా రాజమౌళి రికార్డుకు ఎక్కాడు. సినిమా సినిమాకు దర్శకుడిగా తనను తాను మెరుగుపరుచుకుంటూ తెలుగు సినిమా స్థాయిని పెంచాడు జక్కన్న. ‘బాహుబలి’ సిరీస్‌తో దర్శకుడిగా రాజమౌళి ఖ్యాతి దేశ వ్యాప్తంగా మారు మోగిపోయింది. ఇపుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి నందమూరి,మెగా హీరోలతో మల్టీస్టారర్ చేస్తూ వార్తల్లో నిలిచాడు. రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీస్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా తనయుడు రాజమౌళి పై ఆయన తండ్రి ప్రముఖ రచయత విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఓ ఇంగ్లీష్ ప్రతికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఒక తండ్రిగా రాజమౌళి సక్సెస్ చూసి చాలా గర్వంగా ఫీలవుతున్నా అని చెప్పుకొచ్చారు. మేమిద్దరం మోడ్రన్ తండ్రీ కుమారుడిలా ఉంటామన్నారు. ఇంట్లో పాత తరం తండ్రిలాగే రాజమౌళి తనకు గౌరవం ఇవ్వాలంటూ ఇంట్లో అందరినీ కమాండ్ చేస్తుంటా. కానీ సెట్‌లో వెళితే మాత్రం రాజమౌళి చెప్పింది మేము వినాల్సిందే. ఎందుకంటే అక్కడ రాజమౌళే బాస్. సెట్లో ఆయన దర్శకుడు, నేను ఓ రచయతను మాాత్రమే.

baahubali writer Vijayendra Prasad interesting comments on his son director rajamouli,vijayendra prasad,vijayendra prasad interview,vijayendra prasad instagram,vijayendra prasad twitter,vijayendra prasad rajamouli,k v vijayendra prasad ss rajamouli,vijayendra prasad interesting comments on rajamouli,vijayendra prasad comments on rajamuli,ss rajamouli twitter,ss rajamouli instagram,rrr,rrr twitter,rrr updates,jabardasth comedy show,ram charan jr ntr rajamouli rrr vijayendra prasad,k v vijayendra prasad,k. v. vijayendra prasad,vijayendra prasad movies,vijayendra prasad latest interview,writer vijayendra prasad,kv vijayendra prasad,vijayendra prasad speech,vijayendra prasad about rajamouli,vijayendra prasad about pawan kalyan,vijayendra prasad exclusive interview,rajamouli about vijayendra prasad,ss rajamouli,ss rajamouli father vijayendra prasad,tollywood,telugu cinema,రాజమౌళి,విజయేంద్ర ప్రసాద్,రాజమౌళి ట్విట్టర్,విజయేంద్ర ప్రసాద్ ట్విట్టర్,ఆర్ఆర్ఆర్,ఆర్ఆర్ఆర్ ట్విట్టర్,ఆర్ఆర్ఆర్ విషయాలు,రామ్ చరణ్ ఎన్టీఆర్ రాజమౌళి ఆర్ఆర్ఆర్,రాజమౌళి పై విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యాలు,రాజమౌళి విజయేంద్ర ప్రసాద్,బాహుబలి,రాజమౌళి పై విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
RRR సినిమా


నిజానికి రాజమౌళి మంచి దర్శకుడు అవుతాడనుకున్నాను. కానీ అంతకు మించి నాతో పాటు తెలుగు ఇండస్ట్రీకి తన సినిమాలతో పేరు తీసుకురావడం పట్ల నేను గర్వంగా ఫీలవుతూ ఉంటా. రాజమౌళిలో ముందు నుంచి మంచి కథకుడు ఉన్నాడు. ఒక సన్నివేశాన్ని ఎలా తీస్తే ఆడియన్స్ రీసీవ్ చేసుకుంటారనే దానిపై ఆయనకు పూర్తిగా క్లారిటీ ఉంది. మా మధ్య స్టోరీల విషయంలో ఎన్నో సార్లు భేదాభిప్రాయాలు వచ్చాయి. కానీ ఒక సినిమా విషయంలో అలాంటి భేదాభిప్రాయాలు కరెక్ట్ అని ఇద్దరం నమ్ముతాం. అలా ఉండటం వల్లే దర్శకుడిగా రాజమౌళి సక్సెస్ అయ్యాడు. ఇక  కొన్ని సీన్స్ చిత్రీకరణ  విషయంలో నాకు రాజమౌళికి అసలు పడకపోయేది కాదు. కానీ చివరకు రాజమౌళి ఏదైతే విజన్ అనుకుంటాడో దాన్ని తెరపై ఆవిష్కరింప చేయడంలో ఎపుడు సక్సెస్ అయ్యాడు.
First published: April 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading