• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • BAAHUBALI MANIA IN LONDON SS RAJAMOULI ATTRACTS IN TRADITIONAL LOOK SB

లండన్‌లో రాజమౌళి పంచెకట్టు... పక్కనే ప్రభాస్, అనుష్క

లండన్‌లో రాజమౌళి పంచెకట్టు... పక్కనే ప్రభాస్, అనుష్క

హీరో ప్రభాస్, రానా, అనుష్కలతో పాటు నిర్మాత శోభు యార్లగడ్డ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ వీరు దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  • Share this:
    దర్శక ధీరుడు రాజమౌళి లండన్‌లో పంచెకట్టులో మెరిశారు. లండన్‌లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్ లో దాదాపు 5 వేల మందికి పైగా ప్రేక్షకుల ముందు 'బాహుబలి: ది బిగినింగ్' సినిమాను ప్రదర్శించారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు కీరవాణి ప్రదర్శన కూడా అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బాహుబలి సినిమా టీమ్ లండన్‌కు చేరుకుంది. హీరో ప్రభాస్, రానా, అనుష్కలతో పాటు నిర్మాత శోభు యార్లగడ్డ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ వీరు దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే జపాన్‌లో ప్రభాస్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. దీంతో రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో బాహుబలి సినిమాను చూడాలని జపాన్ నుంచి లండన్ వరకూ కొంతమంది అమ్మాయిలు కూడా వచ్చారు. దీంతో వాళ్లంతా రాజమౌళితో పాటు ప్రభాస్‌తో ఫోటోలు దిగుతూ సందడి చేశారు.



    First published: