ఆ కారణంతోనే నా భార్య ఆత్మహత్య చేసుకుంది : బాహుబలి నటుడు మధు ప్రకాష్

కుంకుమపువ్వు ఫేం మధుప్రకాష్

Baahubali Actor Madhu Prakash Wife Suicide : గతంలోనూ ఆత్మహత్య పేరుతో తనను చాలాసార్లు బెదిరించిందని అన్నాడు. మంగళవారం కూడా అదే జరిగిందని.. తాను ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెబితే.. ఓకె నీ ఇష్టం అని ఫోన్ పెట్టేశానని తెలిపాడు.

 • Share this:
  టీవీ నటుడు, బాహుబలి సినిమాలో నటించిన మధు ప్రకాష్ భార్య భారతి ఆత్మహత్య సంచలనం రేకెత్తిస్తోంది. భారతి ఆత్మహత్యపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.తన భార్య కొంతకాలంగా డిప్రెషన్‌లో ఉండటమే ఆత్మహత్యకు దారితీసిందని మధు ప్రకాష్ చెబుతుండగా.. అయితే భారతిని తమ అల్లుడు ప్రకాషే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కూతురికి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతిది ఆత్మహత్యేనా..? లేక మరేదైనా కోణం ఉందా..? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. భారతి ఆత్మహత్యపై స్పందించిన ఆమె తల్లిదండ్రులు.. వారి ప్రేమ గురించి వైవాహిక జీవితం గురించి పూర్తి వివరాలు వెల్లడించారు.

  లండన్‌లో ఎంబీఏ చదివి కొన్నాళ్లు అక్కడే ఉద్యోగం చేసిన భారతికి 2015లో మధు ప్రకాష్ ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది.ఇరువురి తరుపు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు సాఫీగానే సాగిన కాపురంలో ఆ తర్వాత మనస్పర్థలు మొదలయ్యాయి. ఇద్దరు తరుచూ గొడవపడుతుండేవారు.ఇదే క్రమంలో మంగళవారం మధ్యాహ్నం మధు ప్రకాష్‌కి వీడియో కాల్ చేసిన భారతి.. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు తెలిపింది. ప్రకాష్ ఇంటికి చేరుకునేలోపే ఇంట్లో ఉరేసుకుని
  బలవన్మరణానికి పాల్పడింది.

  మధు ప్రకాష్ ఏమంటున్నాడు..

  భారతి ఆత్మహత్యపై మధుప్రకాష్ మాట్లాడుతూ.. భార్య తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. ఇద్దరి మధ్య మనస్పర్థలు ఎక్కువయ్యాయని తెలిపాడు.ఎప్పుడూ ఫోన్ చెక్ చేస్తుందని.. ఎవరితో మాట్లాడినా అనుమానిస్తుందని అన్నాడు. ఉదయాన్నే షూటింగ్‌కి వెళ్లాల్సి ఉన్నా.. ఆలస్యంగా వెళ్లమంటుందని.. మేనేజర్స్ తిడుతారని చెప్పినా వినిపించుకోకపోయేదని చెప్పాడు. ఇవే విషయాలకు సంబంధించి ఇద్దరి మధ్య గొడవలు పెద్దవై గ్యాప్ పెరిగిపోయిందని తెలిపాడు. గతంలోనూ ఆత్మహత్య పేరుతో తనను చాలాసార్లు బెదిరించిందని అన్నాడు. మంగళవారం కూడా అదే జరిగిందని.. తాను ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెబితే.. ఓకె నీ ఇష్టం అని ఫోన్ పెట్టేశానని తెలిపాడు. అయితే మధ్యలో ఒకసారి కాల్ చేస్తే ఆమె లిఫ్ట్ చేయలేదని.. దాంతో అనుమానం వచ్చిందని చెప్పాడు. తాను వచ్చేసరికి ఆత్మహత్యకు పాల్పడినట్టు చెప్పుకొచ్చాడు. పిల్లలు లేనందుకు కూడా తాను చాలా బాధపడేదని.. దాని గురించి తీవ్రంగా ఆలోచించి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిందని తెలిపాడు. ఆ కారణంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందన్నాడు. భారతి ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా, టీవీ సిరియల్స్ ద్వారా పాపులర్ అయిన నటుడు మధుప్రకాష్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలిలోనూ
  చిన్నపాత్రలో నటించాడు.
  Published by:Srinivas Mittapalli
  First published: