హోమ్ /వార్తలు /సినిమా /

Santosh Soban: కళ్యాణం కమనీయం.. యూత్ అట్రాక్ట్ అయ్యేలా అయ్యో ఏంటో నాకు లిరికల్ సాంగ్

Santosh Soban: కళ్యాణం కమనీయం.. యూత్ అట్రాక్ట్ అయ్యేలా అయ్యో ఏంటో నాకు లిరికల్ సాంగ్

kalyanam kamaneeyam (Photo News 18)

kalyanam kamaneeyam (Photo News 18)

Kalyanam Kamaneeyam Song: యువ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా "కళ్యాణం కమనీయం". తాజాగా ఈ సినిమా నుంచి అయ్యో ఏంటో నాకు లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

యువ హీరో సంతోష్ శోభన్ (Santosh Soban) నటిస్తున్న కొత్త సినిమా "కళ్యాణం కమనీయం" (Kalyanam Kamaneeyam). ఈ చిత్రంలో కోలీవుడ్ తార ప్రియ భవానీ శంకర్ నాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. పెళ్లి నేపథ్యంతో సాగే ఆహ్లాదకర కథతో నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

గత కొన్ని రోజులుగా ఈ కళ్యాణం కమనీయం సినిమా ప్రమోషన్స్ జరుపుతున్నారు మేకర్స్. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ ని స్టార్ హీరోయిన్ అనుష్క రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తాజాగా కళ్యాణం కమనీయం సినిమా నుంచి "అయ్యో ఏంటో నాకు" (Ayyo Ento Lyrical Song) అనే లిరికల్ పాటను విడుదల చేశారు.

ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించారు. శ్రావణ్ భరద్వాజ్ కంపోజ్ చేయగా స్వీకర్ అగస్తి పాడారు. 'అయ్యో ఎంటో నాకు అన్ని వచ్చి పక్కనున్న ఒక్క అదృష్టమేమో దూరముందే.. అన్నీ ఇచ్చేసినట్టు ఇచ్చి లాగేసుకుంటు దైవం వైకుంఠపాళీ ఆడతాడే' అంటూ భార్యభర్తలైన హీరో హీరోయిన్ల మధ్య చిన్న చిన్న మనస్పర్థల నేపథ్యంలో సాగుతుందీ పాట. ఈ చిత్రం నుంచి ఒక్కొక్కటిగా విడుదలవుతున్న పాటలు మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. మొత్తం ఆల్బమ్ ఛాట్ బస్టర్ అవుతోంది. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా "కళ్యాణం కమనీయం" ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.' isDesktop="true" id="1571368" youtubeid="yhFks4EpUoY" category="movies">

ఈ సంక్రాంతికి వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, వారసుడు వంటి మూడు భారీ చిత్రాల మధ్య ఓ ప్లెజంట్ స్మాల్ మూవీగా కళ్యాణం కమనీయం రిలీజ్ కు వస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన మోషన్ పోస్టర్, ఓ మనసా, హో ఎగిరే లిరికల్ సాంగ్స్ కు మంచి ఆదరణ దక్కుతోంది. ట్రైలర్ కూడా ఇంప్రెసివ్ గా ఉండటం అంచనాలు పెంచేసింది. సో.. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి విజయం దక్కించుకుంటుందనేది!.

First published:

Tags: Cinema, Tolllywood, Tollywood actor

ఉత్తమ కథలు