Home /News /movies /

AYYAPPANUM KOSHIYUM ACTOR ANIL NEDUMANGAD DROWNS IN MALANKARA DAM AND PASSED AWAY PK

Anil Nedumangad: మల్లూవుడ్‌లో మరో విషాదం.. డ్యామ్‌లో స్నానానికి వెళ్లి ప్రముఖ నటుడు దుర్మరణం

అనిల్ నేదుమంగడ్ (anil nedumangad)

అనిల్ నేదుమంగడ్ (anil nedumangad)

Anil Nedumangad: మలయాళ ఇండస్ట్రీలో వరస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న క్రిస్మస్ పండగ సందర్భంగా ఇంటి ముందు లైట్ కట్టడానికి చెట్టెక్కి అక్కడ్నుంచి జారిపడి..

మలయాళ ఇండస్ట్రీలో వరస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న క్రిస్మస్ పండగ సందర్భంగా ఇంటి ముందు లైట్ కట్టడానికి చెట్టెక్కి అక్కడ్నుంచి జారిపడి ప్రముఖ హీరో నివిన్ పాలీ మేకప్ మ్యాన్ షాబు పుల్పల్లి చనిపోయాడు. ఈ విషాదం నుంచి కోలుకోకముందే మరో ప్రముఖ నటుడు కన్నుమూసాడు. ఆయన పేరు అనిల్ నేదుమంగాడ్.. మలయాళంలో ఈయనకు మంచి పేరుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్, రానా రీమేక్ చేస్తున్న అయ్యప్పనమ్ కోషియం సినిమాలో అనిల్ ప్రముఖ పాత్రలో నటించాడు. కామట్టిపాడమ్, పావాడ లాంటి పాత్రలలో ఈయన మంచి పేరు తెచ్చుకున్నాడు. డిసెంబర్ 25న తోడుపుళలోని మలంకర ఆనకట్ట దగ్గరికి తన స్నేహితులతో కలిసి స్నానం చేయడానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు అందులో మునిగిపోయి ప్రాణాలు విడిచాడు అనిల్.

ఈయన మృతదేహం ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్నాయి. ఆ తర్వాత అక్కడ్నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురికి పంపిస్తామని పోలీసులు తెలిపారు. జోజు జార్జ్ కథానాయకుడిగా నటిస్తున్న ఓ సినిమా షూటింగ్ కోసం అక్కడ ఉన్నాడు అనిల్. ఈయన సినిమాల్లోకి రాకముందు బుల్లెతెరపై మంచి పేరు తెచ్చుకున్నాడు. టీవీలో నిర్మాత, యాంకర్‌గా పని చేసిన తర్వాత 2014లో స్టీవ్ లోపెజ్‌తో కలిసి వెండితెరపైకి వచ్చాడు అనిల్ నేదుమంగాడ్.

అనిల్ నేదుమంగడ్ (anil nedumangad)
అనిల్ నేదుమంగడ్ (anil nedumangad)


పావడ, కమ్మట్టి పాదం, కిస్మత్, పెరోల్, అయ్యప్పనమ్ కోషియం వంటి చిత్రాల్లో ఈయన నటించాడు. 2020 ఫిబ్రవరిలో విడుదలైన పాపం చెయ్యతవర్ కల్లెరియట్టేలో ఆయన చివరిసారిగా కనిపించాడు. నేదుమంగాడ్ మరణ వార్త తెలియగానే మలయాళ సినిమా పరిశ్రమ ఉలిక్కిపడింది. ఈయన మరణంపై మోహన్ లాల్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి నటులు సంతాపం తెలియచేసారు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Malayala Cinema

తదుపరి వార్తలు