ప్రముఖ సింగర్‌‌కు డ్రగ్స్ ఇచ్చి ఆపై దారుణంగా అత్యాచారం..

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా అమ్మాయిలపై అత్యాచారాలు, హత్యలు ఆగడం లేదు. ఈ దురాగతానికి అంతు లేకుండా పోతుంది. ఇప్పుడు ప్రముఖ సింగర్‌పై కూడా ఇలాంటి దారుణమే జరిగింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 26, 2020, 10:37 PM IST
ప్రముఖ సింగర్‌‌కు డ్రగ్స్ ఇచ్చి ఆపై దారుణంగా అత్యాచారం..
ప్రముఖ సింగర్ డఫీపై అత్యాచారం (duffy singer raped)
  • Share this:
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా అమ్మాయిలపై అత్యాచారాలు, హత్యలు ఆగడం లేదు. ఈ దురాగతానికి అంతు లేకుండా పోతుంది. ఇప్పుడు ప్రముఖ సింగర్‌పై కూడా ఇలాంటి దారుణమే జరిగింది. అయితే తనపై జరిగిన ఈ దారుణాన్ని కాస్త ఆలస్యంగా వెలుగులోకి తీసుకొచ్చింది. అయితే ఇది జరిగింది మన దేశంలో కాదు.. హాలీవుడ్‌లో. అక్కడ గ్రామీ అవార్డు కూడా సొంతం చేసుకున్న ప్రముఖ గాయని డఫీ తన జీవితంలో జరిగిన కొన్ని చేదు సంఘటనల గురించి సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఈ విషయాన్ని చదివిన తర్వాత ఫ్యాన్స్ కూడా షాక్ తిన్నారు. కొన్నేళ్లుగా పాటకు కూడా దూరమైపోయింది డఫీ. దానికి గల కారణాలు ఇప్పుడు తెలిపింది ఈమె.
ప్రముఖ సింగర్ డఫీపై అత్యాచారం (duffy singer raped)
ప్రముఖ సింగర్ డఫీపై అత్యాచారం (duffy singer raped)


2009లో గ్రామీ అవార్డు గెలుచుకున్న తర్వాత హాలీవుడ్‌లో ఈమె పేరు మార్మోగిపోయింది. కానీ ఆ తర్వాత కెరీర్ మరింత దూసుకుపోతుందనుకుంటే.. అసలు కనిపించకుండా పోయింది. దానికి కారణాలు ఇప్పుడు బయటపెట్టింది డఫీ. తన జీవితంలో ఎవరికీ తెలియని సంఘటనలు ఉన్నాయని.. తనను కొందరు అత్యంత దారుణంగా అత్యాచారం చేసారని సంచలన నిజాలు చెప్పింది ఈమె. ఆ తర్వాత బలవంతంగా డ్రగ్స్ ఇచ్చి కొన్ని రోజులు బంధీగా ఉంచారని కూడా చెప్పుకొచ్చింది.
ప్రముఖ సింగర్ డఫీపై అత్యాచారం (duffy singer raped)
ప్రముఖ సింగర్ డఫీపై అత్యాచారం (duffy singer raped)

ఆ దారుణం నుంచి కోలుకోడానికి తనకు చాలా ఏళ్లు పట్టిందని చెప్పుకొచ్చింది ఈమె. అప్పుడు తన గొంతుతో మళ్లీ పాడతానో లేదో అనే అనుమానం కూడా వచ్చిందని.. అందుకే పూర్తిగా దూరమైపోయినట్లు చెప్పింది. ఇప్పుడు ఈ విషయం చెప్పడం సరైన సమయమో కాదో తెలియదు కానీ చెప్పుకోవాలనిపించిందని చెప్పింది డఫీ. ఈమెకు జరిగిన దారుణం గురించి తెలుసుకుని హాలీవుడ్ ప్రముఖులు కూడా షాక్ అవుతున్నారు.
First published: February 26, 2020, 10:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading