Ariyana- Avinash: బిగ్‌బాస్ 4లో హౌజ్‌లో క్లోజ్‌గా ఉన్న కంటెస్టెంట్లలో అరియానా, అవినాష్ జంట ఒకటి. హౌజ్‌లోకి వెళ్లిన కొత్తలో వీరిద్దరి మధ్య పెద్దగా ర్యాపో లేనప్పటికీ.. ఆ తరువాత బాగా క్లోజ్ అయ్యారు. ఇంకా చెప్పాలంటే అరియానాపై అవినాష్ చాలా సార్లు తన ప్రేమను చూపించాడు. అంతేకాదు ఒకరోజు అరియానా పక్కనున్న సమయంలో సోఫాలో ఏదో రాశాడు అవినాష్. దీనిపై అప్పట్లో పెద్ద చర్చనే జరిగింది. అసలు అక్కడ ఏం రాశావు అవినాష్ అంటూ నాగార్జున కూడా అడిగారు. ఇక మధ్యలో అవినాష్ ఎలిమినేట్ అవుతున్నట్లు ఒకసారి నాగార్జున ప్రకటించిన సమయంలో అరియానా చాలా ఏడ్చేసింది. నువ్వు బయటికి వెళితే ఏం చేసుకోనని నాకు మాట ఇవ్వు అంటూ ప్రామిస్ చేయించుకుంది. ఇక చాలా సార్లు నీ డ్రస్ బావుంది, నువ్వు బావున్నావంటూ అరియానాకు బిస్కెట్లు కూడా వేసేవాడు అవినాష్.
ఇక బయటకు వచ్చిన తరువాత టాప్ 5లో ఉన్న అరియానాకు అవినాష్ సపోర్ట్ చేస్తూ వచ్చాడు. అంతేకాదు బయటకు వచ్చిన తరువాత అరియానా కూడా అవినాష్ తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పింది. ఇక హౌజ్‌లో వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడగా.. బయట ఈ జోడీకి ఇప్పుడు వరుస ఆఫర్లు వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ ఇద్దరు స్టార్‌మాలో త్వరలో ప్రసారం కానున్న ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ అనే ప్రోగ్రామ్ పాల్గొన్నారు.
సంక్రాంతి సందర్భంగా ఈ ప్రోగ్రామ్ రానుండగా తాజాగా ప్రోమో విడుదల చేశారు. అందులో అరియానాను చూడగానే అవినాష్ కిందపడతాడు. తరువాత నన్ను చూస్తే ఆలోచిస్తావేంటి..? మాట్లాడు ఏదైనా అని అరియానా అడగ్గా.. హౌజ్‌లో ఉన్నప్పుడే చెబుతామనుకున్నా. కానీ ఇదే కరెక్ట్ టైమ్ అంటూ ఏదో చెప్పనున్నాడు. అంతేకాదు అరియానాను ఎత్తుకొని డ్యాన్స్ కూడా వేయనున్నాడు అవినాష్. మరి అసలు అవినాష్, అరియానాకు ఏం చెప్పనున్నాడు..? తెలియాలంటే ప్రోగ్రామ్ వచ్చే వరకు ఆగాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Star Maa, Television News