• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • AVIKA GOR TO ROMANCE WITH KALYAN DHEV FOR HIS NEXT WITH SREEDHAR SEEPANA SR

చిరంజీవి చిన్నల్లుడితో చిన్నారి పెళ్లికూతురు సరసాలు..

చిరంజీవి చిన్నల్లుడితో చిన్నారి పెళ్లికూతురు సరసాలు..

అవికా గోర్ Photo : Twitter

Avika Gor : చిన్నారి పెళ్లి కూతురిగా టీవీ తెరకు పరిచయమై... ఆ తర్వాత యూత్ గుండెల్లో ఉయ్యాలా జంపాలా అంటూ ఊయలలూగిన భామ అవికా గౌర్.

  • Share this:
    Avika Gor : చిన్నారి పెళ్లి కూతురిగా టెలివిజన్ తెరకు పరిచయమై... ఆ తర్వాత యూత్ గుండెల్లో ఉయ్యాలా జంపాలా అంటూ ఊయలలూగిన భామ అవికా గౌర్. బాలనటిగా పరిచయమై ఆ తర్వాత హీరోయిన్‌గా మారి తన అందచందాలతో అటు తెలుగు, మళయాళం, తమిళ భాషల్లో దూసుకుపోతోంది. రాజ్ తరుణ్‌తో 'సినిమా చూపిస్తమావ'తో మరో హిట్ ను సొంతం చేసుకున్న ఈ అమ్మాయిని చూసి ఇక తెలుగులో ఒక రేంజ్ లో దూసుకుపోతుందని అంతా అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల తెలుగులో గ్యాప్ తీసుకుంది. ఆ మధ్య ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన 'రాజుగారి గది 3' లో మెరిసింది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర తుస్సుమనడంతో ఉపయోగం లేకుండా పోయింది. అయితే తాజాగా వస్తోన్న సమాచారం మేరకు ఈ భామకు అదిరిపోయే ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. అవికా గోర్.. చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ జోడీగా కనిపించనున్నట్టు సమాచారం. 'విజేత' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన కల్యాణ్ దేవ్, 'సూపర్ మచ్చి'తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆ సినిమా తరువాత శ్రీధర్ సీపాన దర్శకత్వంలో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు కళ్యాణ్ దేవ్. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం అవికా గోర్ ఎంపిక చేసుకుందట చిత్రబృందం. ఈ సినిమా గురించి పూర్తి సమాచారం త్వరలో వెల్లడికానుంది.

    Avika gor with Kalyan dhev, Sreedhar seepana film, avika gor news,avika gor movies,uyyala jampala,avika gor interview,avika gor lifestyle,avika gor biography,avika gor age,avika gor family,avika gor serials,avika gor boyfriend,avika gor telugu movies,actress avika gor,avika gor house,avika gor salary,avika gor marriage,avika gor net worth,uyyala jampala heroine avika gor,uyyala jampala movie scenes,avika gor news,uyyala jampala avika gor,అవికా గోర్,అవికా గోర్ పిక్స్,అవికా గోర్ లేటెస్ట్,అవికా గోర్ హాట్, Kalyan dhev, sreedhar seepana, కళ్యాణ్ దేవ్, శ్రీధర్ సీపాన
    కళ్యాణ్ దేవ్ అవికాగోర్ Photo : Twitter
    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు