news18
Updated: December 3, 2020, 10:15 PM IST
అవికా గోర్ (ఫైల్)
- News18
- Last Updated:
December 3, 2020, 10:15 PM IST
బాలికా వధు (చిన్నారి పెళ్లి కూతురు) సీరియల్ తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన అవికా గోర్ తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించింది. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ‘ఉయ్యాలా జంపాలాతో’ తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ.. ఆ పై వరుసగా పలు సినిమాలు చేసింది. నిఖిల్ తో చేసిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, రాజ్ తరుణ్ తో మళ్లీ చేసిన ‘సినిమా చూపిస్త మావ’ లు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టుకున్నాయి. అయితే లాక్డౌన్ లో బొద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ నాజుగ్గా తయారైంది. ఇటీవలే తనకు కాబోయే వరుడిని పరిచయం చేసిన అవికా.. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది.
అవికా గోర్ Instagram లో ఒక వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో అమ్మడు డాన్స్ ఇరగదీసింది. ఓ కొరియోగ్రాఫర్ తో కలిసి డాన్స్ చేస్తున్న వీడియోను ఆమె షేర్ చేసింది. మిర్చి అనే పాటకు ఈ అమ్మడు వేసిన స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఇక ఆమె అభిమానులైతే ఈ వీడియోను చూసి పండుగ చేసుకుంటున్నారు. అవికా ఇంత బాగా డాన్స్ చేయగలదా....? అంటూ వాళ్లు కామెంట్ చేస్తున్నారు. తెలుగులో హోమ్లీ పాత్రలే ఎక్కువ చేసిన ఈ భామ.. డాన్స్ కు పెద్ద స్కోప్ రాలేదు. అవికా గోర్ తెలుగులో చివరిసారిగా కనిపించిన చిత్రం ‘రాజుగారి గది-3’. ఆ తర్వాత ఆమె తెలుగులో సినిమాలు అంగీకరించలేదు.
Published by:
Srinivas Munigala
First published:
December 3, 2020, 10:15 PM IST