Home /News /movies /

AVIDI SESH AND TEAM MAJOR MEETS MAHARASHTRA CM UDDHAV THACKERAY FOR THE MAJOR PROMISE FOR FUND RISING BY ADIVI SESH TA

Major : సైనిక అభ్యర్థుల కోసం అడివి శేష్ ఫండ్ రైజింగ్.. ఈ రూట్లోనే మహారాష్ట్ర సీఎం‌ను కలిసిన మేజర్ టీమ్..

మహారాష్ట్ర సీఎంను మర్యాద పూర్వకంగా కలిసిన మేజర్ మూవీ టీమ్ (Twitter/Photo)

మహారాష్ట్ర సీఎంను మర్యాద పూర్వకంగా కలిసిన మేజర్ మూవీ టీమ్ (Twitter/Photo)

Major Team Meets Maharastra Chief Minister  : అడివి శేష్ టైటిల్ రోల్ ప్లే చేస్తూ నటించిన సినిమా ‘మేజర్’. తాజాగా ఈయన మేజర్ టీమ్‌తో కలిసి మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేను కలిసి ఆయన దగ్గర నుంచి ఓ ప్రామిస్ తీసుకున్నారు.

    Major Team Meets Maharastra Chief Minister  : అడివి శేష్ టైటిల్ రోల్ ప్లే చేస్తూ నటించిన సినిమా ‘మేజర్’.  ఈ సినిమా జూన్ 3 ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ (Major Sandeep Unnikrishnan) జీవితాన్ని ఎంతో హృద్యంగా తెరకెక్కించారు దర్శకుడు శశి కిరణ్ తిక్క. మేజర్ మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు  అమెరికాలో దాదాపు 600 స్క్రీన్స్‌తో 325 లోకేషన్స్‌లో విడుదలైంది.  ‘మేజర్’ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రూ. 13 కోట్లకు అమ్మారు. ప్రపంచ వ్యాప్తంగా అదనంగా రూ. 5 కోట్లు కలిపి రూ. 18 కోట్లకు అమ్ముడుపోయింది. రూ. 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన మేజర్ మూవీ మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. సోనీ పిక్చర్స్‌తో కలిసి సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా చూసి పవన్ కళ్యాణ్ హీరో అడివి శేష్‌తో పాటు నిర్మాత మహేష్ బాబుకు ప్రత్యేక అభినందనలు తెలియజేసారు.

    తాజాగా ఈ సినిమా కోసం అడివి శేష్.. మేజర్ ఉన్నికృష్ణన్ పేరుతో ఫండ్ రైజింగ్‌కు తెర లేపారు. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా  CDS & NDA లో చేరాలనుకునే  అభ్యర్ధుల కోసం ఈ ఫండ్ రైజింగ్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర  ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ని నుంచి ప్రత్యేకంగా ఈ ఫండ్ రైజింగ్ కోసం ఆయన్ని నుంచి ప్రామిస్ తీసుకున్నారు. మహారాష్ట్ర సీఎంతో భేటితో అడివి శేష్‌తో పాటు దర్శకుడు శశి కిరణ్ తిక్కతో పాటు ఈ సినిమాలో కథానాయికగా నటించిన సాయి మంజ్రేకర్ తండ్రి మహేష్ మంజ్రేకర్ ఉన్నారు.





    ఇప్పటికే  యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా  1 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. హీరోగా అడివి శేష్‌కు తొలి 1 మిలియన్ డాలర్ మూవీ ఇదే కావడం విశేషం. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 10 రోజుల్లో ఎంత వసూళ్లు రాబట్టిందంటే.. మేజర్ మూవీ సినిమా చూసి ప్రముఖులు ప్రశంసల ఝల్లు కురిపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 10 రోజు..  రూ. 0.76 కోట్ల షేర్ (రూ. 1.20 కోట్ల గ్రాస్) రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా మిగతా భాషల్లో కలిపి ఈ సినిమా రూ. 1.41 కోట్ల షేర్ (రూ. 2.5 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టి సాలిడ్‌గా దూసుకుపోతుంది.



    మేజర్ 6వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్..
    Nizam: రూ. 7.83 కోట్లు
    Ceeded: రూ. 1.81 కోట్లు
    UA: రూ. 2.02 కోట్లు
    East: రూ. 1.19 కోట్లు
    West:రూ. 88L
    Guntur: రూ. 1.10 కోట్లు
    Krishna: రూ. 1.01 కోట్లు
    Nellore: 65L
    AP-TG Total:- రూ. 16.67 కోట్లు (27.75 కోట్లు Gross)
    KA+ROI:- రూ. 1.85 కోట్లు
    Hindi – రూ. 4.70 కోట్లు
    OS: 5.95 కోట్లు
    వరల్డ్ వైడ్ మొత్తం:- 29.17 CR(52.80 కోట్లు గ్రాస్ )

    Negative Talk To Hit : సర్కారు వారి పాట, పుష్ప సహా నెగిటివ్ టాక్‌తో హిట్ కొట్టిన స్టార్ హీరోల సినిమాలు..

    మేజర్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ. 13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.  ఈ మూవీ హిట్ అనిపించుకోవాలంటే.. బాక్సాఫీస్ దగ్గర రూ. 19 కోట్లు వసూళు చేయాలి. కానీ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని .. రూ. 10.17 కోట్లతో లాభాల్లోకి వచ్చింది.

    Nayanthara - Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేష్ శివన్ గురించి ఎవరికీ తెలియని కొన్ని షాకింగ్ విషయాలు..

    ఇక ప్రముఖ రేటింగ్ సంస్థ IMDB మేజర్ మూవీకి 9.2 / 10 రేటింగ్ ఇచ్చింది. గతంలో అడివి శేష్ నటించిన ‘గూఢచారి’ మూవీకి 7.8/10 రేటింగ్ ఇచ్చింది.  ఇక అది అలా ఉంటే ఈ సినిమా ఓటీటీ విషయంలో అప్పుడే ఓ క్లారిటీ వచ్చింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. మేజర్ సినిమా తెలుగుతో పాటు హిందీ, మలయాళం భాషాల్లో నెట్‌ఫ్లిక్స్‌లో థియేటర్‌‌లోకి వచ్చిన 50 రోజులకు అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఈ సినిమాలో శోబిత ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Adivi Sesh, Bollywood news, Major Movie, Tollywood, Uddhav Thackeray

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు