Krishna Kumar NKrishna Kumar N
|
news18-telugu
Updated: April 27, 2019, 12:07 PM IST
అవెంజర్స్ ఎండ్ గేమ్ (Image : Twitter)
Avengers Endgame Box Office Collections : ఇదివరకు ఎప్పుడూ లేనంతగా హాలీవుడ్ మూవీ అవెంజర్స్ ఎండ్ గేమ్... బాక్సాఫీస్ దగ్గర భారీ ఎత్తున కలెక్షన్లు కుమ్మేస్తోంది. విడుదలైన తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.1,186 కోట్లు కలెక్ట్ చేసింది ఈ సినిమా. 2015లో వచ్చిన స్టార్ వార్స్ సిరీస్ మూవీ ఫోర్స్ ఎవేకెన్స్ ప్రివ్యూ షోకి రూ.419 కోట్లు రాబడితే... అవెంజర్స్ ఎండ్ గేమ్... ఆ రికార్డును బద్దలు కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసిన ఎవెంజర్స్ ఎండ్ గేమ్ మొదటి రెండు రోజుల్లోనే రూ.2,130 కోట్లు కలెక్ట్ చేసింది. ఇండియా సహా 46 దేశాల్లో ఆడుతున్న ఈ సినిమా... యూకేలో అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్ పేరుతో ఉన్న సింగిల్ డే రికార్డును వెనక్కి నెట్టి... రూ.104 కోట్లు కలెక్ట్ చేసింది.
ఇక అతిపెద్ద ఇంటర్నేషనల్ మార్కెట్ అయిన చైనాలో అవెంజర్స్ ఎండ్ గేమ్ రెండు రోజుల్లో ఏకంగా రూ.1,075 కోట్లు రాబట్టింది. ఆరంభంలోనే రూ.747 కోట్లతో మొదలై... కలెక్షన్ల సునామీ సృష్టించింది.
మార్వెల్ సినీమాటిక్ యూనివర్స్ సమర్పిస్తున్న 22వ సినిమా అవెంజర్స్ ఎండ్ గేమ్... విడుదలకు ముందే... ప్రపంచవ్యాప్తంగా టికెట్లన్నీ అన్లైన్లో అమ్ముడైపోయాయి. అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమాకి ఇండియాలో ఆన్లైన్లో సెకండ్‌కి 18 టికెట్లు బుక్కయ్యాయని బుక్‌మైషో ప్రకటించింది.
ఈ సినిమాను ఇండియాలో ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో రిలీజ్ చేశారు. ఇదివరకు ఇదే సిరీస్‌లో అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ ఇండియాలో మొదటివారంలోనే రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది. అవెంజర్స్ ఎండ్ గేమ్‌లో క్రిస్ ఇవాన్స్, రాబర్ట్ డావ్నీ జూనియర్, క్రిస్ హేమ్స్‌వర్త్, మార్క్ రఫ్పాలో, స్కార్లెట్ జాన్సన్, బ్రీ లార్సన్ ప్రధాన పాత్రల్లో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
ప్రణయ్ హత్య కేసులో మారుతీరావుకు బెయిల్... ఆందోళనలో ప్రణయ్ కుటుంబం
ఇండియాలోకి ఉగ్రవాదులు వస్తారని ఊహించాడట... ఫేక్ కాల్ చేసినందుకు అరెస్ట్...
బూత్ లెవెల్లో టీడీపీ సర్వే... పూర్తి వివరాలు కోరిన చంద్రబాబు... గెలుపు లెక్కలు తేల్చేందుకు...
నేడు హైదరాబాద్‌కి జగన్... పార్టీ నేతలతో కీలక సమావేశం... ఎన్నికల ఫలితాలపై చర్చ
First published:
April 27, 2019, 12:04 PM IST