‘అవెంజర్స్4’ ట్రైలర్... విజువల్ వండర్ రెఢీ టు రిలీజ్...

Avengers Endgame Trailer: సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేసిన మార్వెట్ స్టూడియోస్... సరికొత్త ట్రైలర్‌లోనూ థానోస్‌ను చూపించకుండా సస్పెన్స్... ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 26న విడుదల...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 14, 2019, 9:15 PM IST
‘అవెంజర్స్4’ ట్రైలర్...  విజువల్ వండర్ రెఢీ టు రిలీజ్...
అవెంజర్స్ మూవీ పోస్టర్
  • Share this:
హాలీవుడ్ సినిమాలు చూసేవారికి ‘అవెంజర్స్’ సిరీస్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ హీరోలు కలిసి కట్టుగా ప్రపంచాన్ని నాశనం చేయాలనుకునేవారి ఆటకట్టిస్తుండడం ఈ సినిమాల మెయిన్ థీమ్. ‘అవెంజర్స్’ సినిమాగా కంటే చాలామందికి ఓ ఎమోషన్‌గా కనిపిస్తూ ఉంటుంది. ఫ్యామిలీ డ్రామా సినిమాలు చూసి ఎలాంటి చలనం చూపించని వారు కూడా ‘అవెంజర్స్’ సినిమాలు చూసి ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. ‘అవెంజర్స్ 4’ మూవీగా వస్తున్న ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ సరికొత్త ట్రైలర్ తాజాగా విడుదలైంది. మొదటి ట్రైలర్‌లో ఎమోషనల్ కంటెంట్‌తో నింపేసి, అభిమానులను ఎడిపించిన మార్వెల్ సంస్థ... మరోసారి అదే కంటెంట్‌ను హైలెట్ చేస్తూ తాజా ట్రైలర్ విడుదల చేసింది.

‘అవెంజర్స్’ సిరీస్‌లో వచ్చిన చివరి సినిమా ‘అవెంజర్స్ ఇన్ఫినిటీవార్‌’ క్లైమాక్స్‌లో సూపర్‌హీరోలు మాయమవుతూ కనిపిస్తారు. అసలు వాళ్లు ఎక్కడికి వెళ్లారు? అనేది మొదటి ట్రైలర్‌లో శాంపిల్ చూపించారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా సెకండ్ ట్రైలర్ విడుదలైంది. ‘ఈ ప్రాంతం నేనెప్పుడో చూసినట్టు ఉంది. వెయ్యేళ్లు వెనక్కి వెళ్లినట్టుంది...’ అంటూ ఐరన్ మ్యాన్ వాయిస్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఐరన్ మ్యాన్... ఏదో గ్రహం మీదకి వెళతాడు. అక్కడ మెలకువ వచ్చిన తర్వాత అతని ఆలోచనలతో ట్రైలర్ స్టార్ చేశారు. ఆ తర్వాత వివిధ ప్రాంతాల్లో ఉన్న అవెంజర్స్‌ను చూపిస్తారు. అంతా ఏకమై కొత్త యూనిఫామ్‌లో థానోస్‌పై యుద్ధానికి బయలుదేరుతారు. అయితే ఈ ట్రైలర్‌లో థానోస్‌ను ఎక్కడా చూపించలేదు. 146 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌ చివర్లో థోర్ సీన్ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 26న విడుదల కాబోతోంది.

ట్రైలర్ చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి...


First published: March 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading