Avengers: Endgame క్లైమాక్స్ చెప్పేసినందుకు చావగొట్టారు..

హాంగ్‌కాంగ్‌లోని ఓ మాల్ బయట ఆ వ్యక్తి బిగ్గరగా అరుస్తూ సినిమా క్లైమాక్స్ మొత్తం చెప్పేయడంతో అక్కడున్న ఫ్యాన్స్‌లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

news18-telugu
Updated: April 27, 2019, 7:59 PM IST
Avengers: Endgame క్లైమాక్స్ చెప్పేసినందుకు చావగొట్టారు..
అవెంజర్స్ ఎండ్ గేమ్ (Image : Twitter)
  • Share this:
అవేంజర్స్ ఎండ్ గేమ్ సినిమా చూడాలని ప్రపంచం మొత్తం ఎదురుచూసింది. ఈ సిరీస్‌లో ఇదే చివరి మూవీ కావడంతో అభిమానులు తొలిరోజు సినిమా చూసేందుకు పోటెత్తారు. ప్రపంచం వ్యాప్తంగా రికార్డు కలెక్షన్లు కూడా సృష్టించిందీ సినిమా. అయితే, హాంగ్‌కాంగ్‌లో ఓ ఘటన జరిగింది. సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన ఓ వ్యక్తి తన ఉత్సాహం ఆపుకోలేక సినిమా క్లైమాక్స్‌లో ఏం జరుగుతుందో అందరికీ చెప్పేశాడు. హాంగ్‌కాంగ్‌లోని ఓ మాల్ బయట ఆ వ్యక్తి బిగ్గరగా అరుస్తూ సినిమా క్లైమాక్స్ మొత్తం చెప్పేయడంతో అక్కడున్న ఫ్యాన్స్‌లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సినిమా క్లైమాక్స్ మొత్తం ధియేటర్ బయటే చెప్పేస్తే.. ఇక ధ్రిల్ ఏముంటుందంటూ అభిమానులు అతడిని చావగొట్టారు. రక్తం కారుతున్నా పట్టించుకోకుండా పడేసి వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

First published: April 27, 2019, 7:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading