Home /News /movies /

AVENGERS ENDGAME LEAKED ONLINE BY TAMILROCKERS REPORT NK

అవెంజర్స్‌కి షాక్... రిలీజ్‌కి రెండ్రోజుల ముందే పైరసీలో సినిమా మొత్తం రిలీజ్...

అవెంజర్స్ ఎండ్ గేమ్ (Image : Twitter)

అవెంజర్స్ ఎండ్ గేమ్ (Image : Twitter)

Avengers Endgame Leaked : రస్సో బ్రదర్స్ దర్శకత్వం చేసిన అవెంజర్స్ ఎండ్ గేమ్ ఈ ఏడాది రిలీజవుతున్న సినిమాల్లో అత్యంత ప్రజాదరణ పొందుతోంది.

మార్వెల్ సినీమాటిక్ యూనివర్స్ సమర్పిస్తున్న 22వ సినిమా అవెంజర్స్ ఎండ్ గేమ్... విడుదలకు ముందే... ప్రపంచవ్యాప్తంగా టికెట్లన్నీ అన్‌లైన్‌లో అమ్ముడైపోయాయి. తొలి రోజు ఇండియన్ బాక్సాఫీస్ కలెక్షన్ రూ.400 కోట్లను దాటింది. ఈ హాలీవుడ్ ఫిల్మ్ వరల్డ్ వైడ్‌గా ఏప్రిల్ 27న రిలీజవుతుంటే... రెండ్రోజులకు ముందే... ఏప్రిల్ 25న తమిల్ రాకర్స్ వెబ్‌సైట్‌లో సినిమా మొత్తం పైరసీలో రిలీజైంది. కెమెరా ప్రింట్‌ను రిలీజ్ చేసినట్లు తమిల్ రాకర్స్ ప్రకటించింది. ఇప్పటివరకూ ఇలాంటి ఎన్నో సినిమాల్ని పైరసీ చేసి చూపించింది ఈ వెబ్‌సైట్. దీన్ని అడ్డుకోవడం సాధ్యం కావట్లేదు. పైరసీ రిలీజ్ ప్రభావం ఇండియాలో సినిమా కలెక్షన్లపై పడుతుందనే ఆందోళన కనిపిస్తోంది.

Avengers Endgame, Avengers Endgame release date, Avengers Endgame release date in India, Avengers Endgame leaked online, Avengers Endgame leaked online by TamilRockers, film piracy, piracy, piracy websites, Russo Brothers, Tamil rockers, TamilRockers.com, TamilRockers, movies. My best, అవెంజర్స్ ఎండ్ గేమ్, అవెంజర్స్ మూవీ, అవెంజర్స్ లీక్, సినిమా, పైరసీ, లీక్, బాక్సాఫీస్, పైరసీ మూవీ రిలీజ్, సినిమా లీక్,
అవెంజర్స్ ఎండ్ గేమ్ (Image : Twitter)


అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమాకి ఇండియాలో ఆన్‌లైన్‌లో సెకండ్‌కి 18 టికెట్లు బుక్కయ్యాయని బుక్‌మైషో ప్రకటించింది. ఈ సినిమాను ఇండియాలో ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇదివరకు ఇదే సిరీస్‌లో అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ ఇండియాలో మొదటివారంలోనే రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది. అవెంజర్స్ ఎండ్ గేమ్‌లో క్రిస్ ఇవాన్స్, రాబర్ట్ డావ్నీ జూనియర్, క్రిస్ హేమ్స్‌వర్త్, మార్క్ రఫ్పాలో, స్కార్లెట్ జాన్సన్, బ్రీ లార్సన్ ప్రధాన పాత్రల్లో ప్రేక్షకుల్ని అలరించబోతున్నారు.

తమిళ్ రాకర్స్ అనేది ఓ ఇల్లీగల్, పైరసీ సైట్. డిమాండ్, సప్లై సూత్రంతో పనిచేస్తోంది. ఎలాంటి సినిమానైనా పైరసీలో రిలీజ్ చేస్తోంది. థియేటర్లకు వెళ్లేందుకు ఇష్టంలేని వారు... ఈ సైట్‌లో ఫ్రీగా, మనీ చెల్లించి వేర్వేరు వెర్షన్‌లలో సినిమాలు చూస్తున్నారు. ఇలా ఈ సైట్... నిర్మాతల డబ్బును దోచుకుంటోంది.

 

ఇవి కూడా చదవండి :

తండ్రి మసాలా వ్యాపారి... కొడుకులు ఉగ్రవాదులు... శ్రీలంక పేలుళ్లలో ఆశ్చర్యకర విషయాలు

పవన్ కళ్యాణ్ బాటలో నాగబాబు... జబర్దస్త్ విషయంలో ఏమన్నారంటే...

మాకొద్దీ ఎన్నికల బెట్టింగ్ బాబోయ్... టెన్షన్ తట్టుకోలేకపోతున్న ప్రజలు...

టార్గెట్ టీడీపీ... ఏపీలో ఓన్లీ వైసీపీ... కేసీఆర్‌తో జగన్ ఏం చర్చించబోతున్నారు...
First published:

Tags: Bollywood, Bollywood Movie, Bollywood news, Hollywood, Hollywood News, Piracy, Tollywood Cinema, Tollywood news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు