Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: May 20, 2019, 7:30 PM IST
అవతార్ అవేంజర్స్ సినిమా
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ విన్నా కూడా అవేంజర్స్ ఎండ్ గేమ్ గురించే చర్చ నడుస్తుంది. విడుదలై నెల రోజులవుతున్నా ఇప్పటికీ వసూళ్ల సునామీ మాత్రం ఆగడం లేదు. ఒకటి రెండు కాదు.. ఏకంగా 5360 కోట్లు వసూలు చేసింది ఆల్ టైమ్ రికార్డులు సృష్టించింది ఈ చిత్రం. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కూడా ఈ చిత్ర వసూళ్ల సునామీ చూసి అంతా షాక్ అవుతున్నారు. అసలు హాలీవుడ్ సినిమాలకు ఇండియాలో ఇంత ఆదరణ ఉందా అని అంతా షాక్ అవుతున్నారు.

అవెంజర్స్ ఎండ్ గేమ్ (Image : Twitter)
ఒక్క బాహుబలి తప్ప అన్ని రికార్డులు ఈ చిత్రం ఖాతాలోకి వెళ్లిపోయాయి. అంతగా దుమ్ము దులిపేసింది అవేంజర్స్ ఎండ్ గేమ్. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా ఏకంగా అవతార్ రికార్డులను సైతం బ్రేక్ చేసింది. ఇదే సెన్సేషనల్ అవుతుందిప్పుడు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన 22వ సీక్వెల్ ఇది. అమెరికాలోనే ఏకంగా 5360 కోట్ల వరకు వసూలు చేసింది. దాంతో అమెరికన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా ఈ చిత్రం నిలిచింది.

టైటానిక్ అవేంజర్స్
ఇప్పటి వరకు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన అవతార్ అగ్రస్థానంలో ఉంది. ఈ చిత్రం అప్పట్లో 760.5 మిలియన్ల డాలర్లు అంటే 5294 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు అవేంజర్స్ ఎండ్ గేమ్ వాటిని అధిగమించింది. ఇప్పటి వరకు ప్రపంచ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం అవతార్. ఈ సినిమా పదేళ్ల కిందే దాదాపు 1 లక్ష 94 వేల కోట్లు వసూలు చేసింది. ఇక రెండో స్థానంలో జేమ్స్ కామెరూన్ అద్భుతం టైటానిక్ 218 కోట్ల డాలర్లు.. అంటే మన ఇండియన్ కరెన్సీలో లక్షా 52 వేల కోట్ల రూపాయలు వసూలు చేసింది.

అవెంజర్స్ ఎండ్ గేమ్ పోస్టర్
ఇప్పుడు వీటిని అవేంజర్స్ ఎండ్‌గేమ్ అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే గానీ జరిగితే కొత్త రికార్డులకు ఈ చిత్రం తెరతీసినట్లే. విడుదలైన నెల రోజుల తర్వాత కూడా ఈ చిత్రం మంచి వసూళ్లనే రాబడుతుంది. మరి చూడాలిక.. ఇప్పటికైతే అమెరికాలో అవతార్ వసూళ్లను దాటిన అవేంజర్స్.. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇదే అద్భుతాన్ని రిపీట్ చేస్తుందో లేదో..?
First published:
May 20, 2019, 7:30 PM IST